రావణుని వైభోగం ఎంత? అవశేషాలు ఎక్కడున్నాయి?

Ravana Palace was Like this in Sri Lanka - Sakshi

దసరా రోజున రావణ దహనం చేస్తారు. ఇది మనలోని చెడును కాల్చివేయాలనే సందేశాన్ని అందిస్తుంది. అయితే ఇప్పుడు మనం రావణ దహనం గురించి కాకుండా రావణుని వైభోగం గురించి తెలుసుకోబోతున్నాం. రావణుడు ఎంత విలాసవంతమైన జీవితాన్ని గడిపాడో? అతని రాజభవనం ఎంత విలాసవంతమైనదో ఈ కథనంలో తెలుసుకుందాం.

నేడు శ్రీలంకలో కనిపించే ‘సిగిరియా’ ఒకప్పుడు రావణుడి లంక అని చెబుతారు. రావణునికి ఇక్కడ ఒక పెద్ద రాతిపై ఒక రాజభవనం ఉందని, అక్కడ అతను సురక్షితంగా నివసించాడని స్థానికులు చెబుతారు. ఇక్కడికి సమీపంలో ఒక ప్రత్యేక విమానాశ్రయం ఉందని, అక్కడ నుండే రావణుని పుష్పక విమానం ఎగురేదని చెబుతారు. 

ఆనాటి కాలానికి అనుగుణంగా రావణుడి రాజభవనం పలు ఆధునిక సౌకర్యాలతో ఉండేది. రావణుని రాజభవనానికి లిఫ్ట్ సౌకర్యం ఉందని, నీటి నిర్వహణకు ఆధునిక వ్యవస్థ కూడా ఉండేదని చెబుతారు. మీడియా కథనాల ప్రకారం శ్రీలంకలోని సిగిరియా రాతిపై పురాతన ప్యాలెస్ అవశేషాలు కనిపించాయి.

ఇక్కడి రాగైలా అడవుల్లో రావణుని మృతదేహాన్ని దాదాపు 8 వేల అడుగుల ఎత్తులో ఉంచినట్లు శ్రీలంక మీడియా పేర్కొంది. దానిని మమ్మీ రూపంలో ఉంచారని చెబుతారు. అయితే దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. శ్రీలంకలో రావణుని ప్యాలెస్ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. 
ఇది కూడా చదవండి: ఇందిర ‘మూడవ కుమారుడు’ ఎవరు?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top