వెరైటీ ఫుడ్‌..దాన్ని చూసి నెటిజన్‌లు షాక్‌!

The Pasta Making Hack Is Leaving Netizens Horrified - Sakshi

రోమ్‌: సోషల్‌ మీడియా.. మన భావాలను పంచుకోవడానికి చక్కని వేదిక. దీనిలో మంచి, చెడు, నిజం, అబద్దం అన్నీ చక్కర్లు కొడతాయి. ప్రపంచ జనాభాలో దాదాపు 3.96 బిలియన్ల (58.11% శాతం) మంది సోషల్ మీడియాలో విహరిస్తున్నట్లు అంచనా. వీరు రోజుకు సగటున 2 గంటల సమయం ఇందులోనే గడుపుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సోషల్ మీడియా దాదాపు దశాబ్ద కాలం కిందట మాత్రమే పుట్టుకొచ్చింది. ఈ రోజుల్లో మనుషులు ప్రతిదీ దీనిలో పంచుకుంటున్నారు. తాజాగా ఇటలీకి చెందిన జోష్, లిసా ఫేస్బుక్ పేజీలో షేర్ చేసిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఓ మహిళ హాక్  స్టెప్ ట్యుటోరియల్ ద్వారా రెండు డబ్బాల పాస్తా సాస్ పోసి సాస్‌పై మీట్‌బాల్స్, బ్రెడ్‌, సలాడ్స్‌ ఇంకా కొన్ని పదార్థాలను కలిపి స్పఘెట్టి పాస్తాను తయారు చేసింది.

అయితే ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు 27 మిలియన్లకు పైగా నెటిజన్లు వీక్షించారు. ఈ విధంగా బల్లపై తయారు చేసే ఈ ఆహారాన్ని చూసి నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. "నేను మీ ఇంటికి విందు కోసం వస్తే..మర్యాదగా నాకు వద్దని చెప్తాను. అయినా దీన్ని ఎవరూ కూడా తినరు" అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. " మీరు తయారు చేసిన విధానం చాలా అపరిశుభ్రంగా ఉంది. మీకు నాస్టీస్ట్ డిన్నర్  అవార్డు ఇవ్వాలి" అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు. "నా కళ్ళు! నా కళ్ళు!" అంటూ మరొకరు ఆందోళన చెందుతున్నట్టు పోస్ట్ చేశారు.

(చదవండి: ఈ ఐడెంటికల్‌ ట్విన్‌ సిస్టర్స్‌ ప్రతిభ అదుర్స్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top