North korea: సౌత్‌ కొరియాకు కిమ్‌ మళ్లీ వార్నింగ్‌ | North Korea Kim Sensational Comments On War With South Korea | Sakshi
Sakshi News home page

సౌత్‌ కొరియాకు కిమ్‌ మళ్లీ వార్నింగ్‌

Jan 10 2024 8:30 AM | Updated on Jan 10 2024 9:04 AM

North Korea Kim Sensational Comments On War With South Korea - Sakshi

ప్యాంగ్‌యాంగ్‌: ఉత్తర కొరియా నియంత కిమ్‌జాంగ్‌ఉన్‌ మరోసారి దక్షిణ కొరియాపై సంచలన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. దక్షిణ కొరియాతో సంబంధాలు మెరుగుపరుచుకోవడమే తమకు ముఖ్యమని, అయితే తమ పై ఆ దేశం మిలిటరీ చర్యలకు దిగితే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించారు.

తమ వద్ద ఉన్న మొత్తం సామర్థ్యం మొత్తం వినియోగించైనా సరే దక్షిణ కొరియాను లేకుండా చేస్తామని కిమ్‌ అన్నట్లు కొరియా సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ తాజాగా వెల్లడించింది. పరోక్షంగా అణుబాంబులు వేయడానికి కూడా వెనుకాడబోమని కిమ్‌ వ్యాఖ్యలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత వారంలో దక్షిణ కొరియాకు సరిహద్దులో ఉన్న సముద్రంలోని ఓ ఐలాండ్‌లో ఉత్తర కొరియా 200 రౌండ్ల ఆర్టిలరీ బాంబులు వేసింది.

దీంతో అప్రమత్తమైన దక్షిణ కొరియా అక్కడ ఉంటున్న కొంత మంది ప్రజలను ఖాళీ చేయించినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు కిమ్‌  ఈ ఏడాది జరగనున్న సౌత్‌కొరియా, అమెరికా సార్వత్రిక ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు.

రెండు దేశాల్లో తనకు అనుకూలమైన వారు ఎన్నికవుతారని ఆయన ఆశిస్తున్నట్లున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటు దక్షిణ కొరియాలో లిబరల్స్‌ అమెరికాలో తిరిగి ట్రంప్‌ అధికారంలోకి వస్తారని, వీరు గనుక ఎన్నికైతే తమకు కొంత వరకు మేలు జరుగుతుందని కిమ్‌ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇదీచదవండి..వామ్మో 2023

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement