కరోనా: ఆకట్టుకుంటున్న నైక్ వీడియో

ఒరెగాన్ : కరోనా వైరస్ మహమ్మారి దాటికి విశ్వవ్యాప్తంగా అన్ని రకాల క్రీడలు స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. అయితే మెళ్లిగా ఇప్పుడిప్పుడే అన్ని రకాల క్రీడలు ప్రారంభమవుతున్నాయి. ఆట ఏదైనా సరే జనాలు మైదానంలోకి గుంపులుగా రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత స్పోర్ట్ అడ్వర్టైజింగ్ కంపెనీ నైక్ కరోనా వైరస్‌కు బయపడేది లేదంటూ తన ట్విటర్ ద్వారా ఒక ఉత్తేజపరిచే వీడియోతో మన ముందుకొచ్చింది. దాదాపు 1.39 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో అన్ని రకాల క్రీడలతో పాటు 36 మంది పాతతరం, కొత్తతరం స్టార్ ఆటగాళ్లను కలిపి చూపించారు. రఫెల్ నాదల్, జొకొవిచ్, టీమిండియా క్రికెట్ మహిళల టీం, క్రిస్టియానో రొనాల్డొ, సెరెనా విలియమ్స్, లెబ్రన్ జేమ్స్, కొలిన్ కెపెర్‌నిక్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు కనిపిస్తారు. ('నాకు కరోనా వచ్చి మేలు చేసింది')
'వీ ఆర్ నెవర్ ఎలోన్..' అంటూ సాగే వీడియో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. 'కరోనా లాంటి ఎన్ని వైరస్‌లు వచ్చినా మేం బభయపడం. అథ్లెట్స్‌గా మేం ఎప్పుడు ఒంటరివాళ్లం కాదు.. మేమంతా ఐక్యంగా ఉంటూనే ఏ విషయమైనా కలిసే పోరాడుతాం. మా ఆటలే మమ్మల్ని ఈరోజుకు ఐక్యంగా ఉండేలా చేశాయి. కరోనా వైరస్ ఆటకు మమ్మల్ని దూరం చేసినా.. తిరిగి మళ్లీ అదే శక్తితో కలసికట్టుగా వస్తున్నాం' అంటూ ఫీమేల్ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో కొనసాగుతుంది. ఈ వీడియోకు అమెరికన్ సాకర్ ప్లేయర్ మేడన్ రాపినో వాయిస్ ఓవర్ అందించారు. యూ కాంట్ స్టాప్ స్పోర్ట్.. యూ కాంట్ స్టాప్ అస్ అంటూ క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం నైక్ రూపొందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్కరోజులోనే దాదాపు 13 మిలియన్ల మంది వీక్షించారు.
Nothing can stop what we can do together. You can’t stop sport. Because #YouCantStopUs.
Join Us | https://t.co/fQUWzDVH3q pic.twitter.com/YAig7FIL6G
— Nike (@Nike) July 30, 2020
మరిన్ని వార్తలు