రెండేళ్లుగా వాయిదా.. త్వరలో పెళ్లికూతురవనున్న ప్రధాని

New Zealand PM Jacinda Ardern Plans Summer Wedding - Sakshi

ఈ ఏడాది వేసవిలో న్యూజిలాండ్‌ ప్రధాని వివాహం

పెళ్లికి ముందే బిడ్డకు జన్మనిచ్చిన జెసిండా

ఆక్‌లాండ్‌: పాపం న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌కు పెళ్లి చేసుకుందామంటే సమయమే దొరకడం లేదట. గత రెండేళ్లుగా ఆమె పెళ్లి వాయిదా పడుతూ వస్తుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు జెసిండా. ఈ వేసవిలో పెళ్లికి సిద్ధమవతున్నారట ప్రధాని. అయితే డేట్‌, టైం ఇంకా ఫిక్స్‌ చేయలేదని స్థానిక మీడియా తెలిపింది. జెసిండా కోస్ట్‌ రేడియోతో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికి నాకు టైం దొరికింది. ఈ వేసవిలో నేను, నా భాగస్వామి క్లార్కే గేఫోర్డ్‌  వివాహం చేసుకోవాలని భావిస్తున్నాం. టైం, డేట్‌ ఇంకా ఫిక్స్‌ చేయలేదు. ఎవరికి చెప్పకుండా వివాహం చేసుకోవాలని మేం కోరుకోవడం లేదు. కొద్ది మందిని తప్పక ఆహ్వానిస్తాం’’ అని ప్రధాని తెలిపినట్లు మీడియా వెల్లడించింది. 

ఇక జెసిండా ఆర్డెర్న్‌(40)కు, క్లార్కే(44)కు 2019లో నిశ్చితార్థం అయ్యింది. ఆ ఏడాది ఈస్టర్‌ సెలవుల్లో వీరు ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి రెండు సంవత్సరాల కుమార్తె ఉంది. అయితే ఇప్పటి వరకు వీరు వివాహం చేసుకోలేదు. పలు కారణాల వల్ల వీరి పెళ్లి వాయిదా పడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ వేసవిలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు జెసిండా. దక్షిణార్థగోళంలో డిసెంబర్‌ నుంచి ఫిబ్రవరి నెలల్లో వేసవి ఉంటుంది. ఆ సమయంలో వివాహం చేసుకోవాలని జెసిండా నిర్ణయించుకున్నారు. ఇక సంప్రాదాయబద్దంగా తన పెళ్లి జరగదని జెసిండా తెలిపారు. అలా చేయడం తనకు ఇష్టం లేదని జెసిండా వెల్లడించినట్లు మీడియా ప్రచురించింది. 

ఇక జెసిండా 2017లో న్యూజిలాండ్‌ ప్రధానిగా ఎన్నికయ్యారు. గతేడాది అక్టోబర్‌లో తిరిగి మరోసారి ప్రధాని పీఠం చేజిక్కుంచుకున్నారు. ప్రధానిగా ఉన్న సమయంలో బిడ్డకు జన్మనిచ్చారు జెసిండా. ఇక కోవిడ్‌ను కంట్రోల్‌ చేయడంలో జెసిండా ప్రపంచదేశాధ్యక్షులకు స్ఫూర్తిగా నిలిచారు. 

చదవండి: భూకంపం వచ్చినా ఇంటర్వ్యూ ఆపని ప్రధాని

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top