భూకంపంలోనూ ప్రధాని జెసిండా ఇంటర్వ్యూ

New Zealand PM Jacinda Ardern Continues Live Interview While Having Earthquake - Sakshi

వెల్లింగ్టన్‌‌ : న్యూజిలాండ్‌ దేశ  ప్రధాని జెసిండా ఆర్డన్స్‌ మరోసారి తన మార్క్‌ ఏకాగ్రతను ప్రదర్శించారు. భూకంపం వచ్చినా కూడా జంకకుండా తను ఓ టీవీ ఛానల్‌కు ఇస్తున్న ఇంటర్వ్యూను నవ్వులు చిందిస్తూ కొనసాగించారు. లైవ్‌ ఇంటర్వ్యూలోనే భూకంపం సంగతులను రిపోర్టింగ్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం తెల్లవారుజామున న్యూజిలాండ్‌లోని నార్త్‌ ఐలాండ్‌లో 5.6 మాగ్నిట్యూడ్‌ల భూకంపం నమోదైంది. ఆ సమయంలో ప్రధాని జెసిండా వెల్లింగ్టన్‌లోని పార్లమెంట్‌ భవనంనుంచి బ్రేక్‌ఫాస్ట్‌ అనే మీడియా సంస్థకు కరోనా లాక్‌డౌన్‌పై ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఈ సమయంలో భూకంపం దాటికి భవనం కొద్దిగా కంపించసాగింది. అయినప్పటికి జెసిండా భయపకుండా నవ్వుతూ తన ఇంటర్వ్యూను  కొనసాగించారు. ( రెస్టారెంట్‌ వెలుపల వేచిచూసిన ప్రధాని )

ఆమె మాట్లాడుతూ.. ‘‘ ఇప్పుడే ఇక్కడ చిన్న పాటి భూకంపం వచ్చింది. భూమి కొద్దిగా కంపిస్తోంది. నువ్వు(ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తితో) చూసినట్లైతే నా ముందున్న ప్రదేశం కంపించటం గమనించవచ్చు. (కొన్ని సెకన్ల తర్వాత) భూమి కంపించటం ఆగిపోయింది. మేమంతా క్షేమంగా ఉన్నాం. నేను భూకంపాలకు తట్టుకునే భవనంలో ఉన్నానని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.( కరోనాపై విజయం సాధించాం: జెసిండా అర్డర్న్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top