లక్ష ఏ‍ళ్ల నాటి ఆదిమానవుల అవశేషాలు.. వాళ్లను చంపింది..

Neanderthals Remains Found In A Cave In Italy - Sakshi

రోమ్‌ : ఇటలీ దేశంలో లక్ష ఏళ్ల నాటి ఆదిమానవుల అవశేషాలు వెలుగు చూశాయి. ఆగ్నేయ రోమ్‌కు 100 కిలోమీటర్ల దూరంలో పురావస్తు శాస్త్రవేత్తలు వీటిని కనుగొన్నారు. శాన్‌ ఫెలిసె సిసెరో పట్టణంలోని  గువాట్టారి కొండ గుహలో మొత్తం తొమ్మిది మంది ఆదిమానవులకు సంబంధించిన అవశేషాలను గుర్తించారు. పుర్రె ముక్కలు, విరిగిపోయిన దవడ ఎముకలను తవ్వకాల్లో వెలికితీశారు. అవి ఏడుగురు బాలురు, ఓ బాలిక, ఓ యువకుడికి చెందినవిగా భావిస్తున్నారు. అయితే, చనిపోయిన వారందరూ వేరు వేరు కాలాలలో బ్రతికి ఉండేవారని, కొన్ని ఎముకలు 50-68వేల ఏళ్ల పాతవని తెలిపారు. వీరందరూ హైనాల దాడిలో చనిపోయి ఉంటారని, హైనాలు చంపిన వారందరినీ వాటి స్థావరమైన కొండ గుహలోకి లాక్కుని వచ్చుంటాయని భావిస్తున్నారు.

గువాట్టారి కొండ గుహ ప్రాంతంతో మొట్టమొదటి సారి 1939లో ఆదిమానవుల అవశేషాలను గుర్తించారు. భూకంపాల కారణంగా ఈ కొండ గుహ దాదాపు 60 వేల సంవత్సరాలు కప్పివేయబడింది. దీంతో అందులోని అవశేషాలు వేల సంవత్సరాలు పాడవకుండా భద్రంగా ఉన్నాయి. అక్కడ ఆదిమానవుల ఎముకలతో పాటు కూరగాయలు, రైనోసరస్‌, జేయింట్‌ డీర్‌, హైనాల అవశేషాలను కనుగొన్నారు.

చదవండి : ఎనిమిదేళ్ల క్రితమే కరోనాను ఊహించాడు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top