Mysterious Image Caught On Camera at Texas Zoo - Sakshi
Sakshi News home page

రెండు కాళ్లతో వింత జీవి కలకలం.. ఎక్కడో తెలుసా..?

Jun 10 2022 6:05 PM | Updated on Jun 10 2022 7:14 PM

Mysterious Image Caught On Camera At Texas Zoo - Sakshi

ప్రపంచంలో మానవ కంటికి కనిపించని ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో భూమి మీద చోటుచేసుకునే వింతలను చూసి నిజమేనా అని షాక్‌ అవుతుంటాము. తాజాగా అలాంటి ఘటనే ఒకటి అమెరికాలో వెలుగు చూసింది. 

వివరాల ప్రకారం.. టెక్సాస్‌లోని అమారిలో పట్టణంలో ఓ వింత జీవి ఫొటో అక్కడున్న వారిని కలవారపాటుకు గురిచేస్తోంది. టెక్సాస్‌లోని ఒక ‘జూ’లో మే 21వ తేదీన అర్ధరాత్రి 1:25 సమయంలో రెండుకాళ్లపై ఓ జీవి నిలబడి ఉంది. ఈ క‍్రమంలో జూలో ఉన్న సెక్యూరిటీ కెమెరాలో ఇది రికార్డు అయ్యింది. అయితే, ఆ జీవి జూ అవతల ఫెన్సింగ్‌ దగ్గర ఉన్నట్టు సిబ్బంది గుర్తించారు. ఆ తర్వాత ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలకు భయాందోళనకు గురవుతున్నారు.

ఇక, ఈ ఫొటో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలవడంతో ఫొటోపై నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. అది నిజంగా వింత జీవేనా? లేక ఎవరైనా మనుషులే అలాంటి గెటప్‌లో వచ్చారా? అని కామెంట్స్‌ చేస్తున్నారు. కానీ, దీన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు జూ అధికారులు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు వివరణ ఇచ్చారు. 

ఇది కూడా చదవండి: సర్పంతో మహిళ సహజీవనం.. ఆమె సమాధానం విని ఊరంతా సైలెంట్‌!

Advertisement
 
Advertisement
Advertisement