ఎంతపనిచేసింది ఆ దోమ..నాలుగు వారాల కోమా, ఏకంగా 30 సర్జరీలా!

Mosquito Bites Man Slips Into Coma And 30 Surgeries - Sakshi

దోమల వల్ల ఏ డెంగ్యూ లేక మలేరియా వంటి వ్యాధులు వస్తాయని తెలుసు. అంతేగానీ ఏకంగా మూడు వారాల పాటు కోమా, 30 సర్జరీలు చేయించుకోవడం గురించి విన్నారా!. లేదు కదా కానీ ఇక్కడోక వ్యక్తి ఒక్క దోమ కాటు వల్ల ఇంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఔనా! ఇది నిజమా? అని సందేహించొద్దు నిజంగానే జరిగింది. దయ చేసి ఈ దోమల పట్ల జాగ్రత్తగా ఉండండని ఆ వ్యక్తి పలువురికి సలహాలు ఇస్తున్నాడు కూడా.

వివరాల్లోకెళ్తే....జర్మన్‌కి చెందిన 27 ఏళ్ల సెబాస్టియన్‌ రోట్ష్కే 2021లో ఆసియా టైగర్‌ దోమ అతన్ని కుట్టింది. దీంతో అతనికి కొన్ని రోజులపాటు ఫ్లూ వంటి లక్షణాలతో కూడిన జ్వరం వచ్చింది. ఆ తర్వాత రోట్ష్కే కొద్ది రోజుల్లోనే కోలుకుంటాను అని లైట్‌ తీసుకున్నాడు. అది కాస్త రోజు రోజుకి విషమించి చనిపోయేంత ప్రాణాంతకంగా మారిపోయింది. ఆ దోమ కాటు కారణంగా బ్లడ్‌ పాయిజన్‌గా మారిపోయింది.

దీంతో కాలేయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరతిత్తులు సరిగా పనిచేయడం మానేశాయి.  ఆ తర్వాత అతను సుమారు మూడు, నాలుగు వారాలపాటు పూర్తిగా కోమాలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతను ఏదో కొద్దిపాటి అదృష్టం కొద్ది కోమా నుంచి బయటపడ్డాడు. ఆ తదనంతరం ఆ దోమ కుట్టిన ప్రాంతంలో ఏర్పడిన గడ్డను తొలగించేందుకు ఏకంగా 30 సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది.

దీంతో రోట్ష్క్‌ ఏకంగా సగం తోడను పోగొట్టుకోవాల్సి వచ్చింది కూడా. ఈ సర్జరీల కారణంగా తాను కొన్నేళ్ల పాటు మంచానికే అతుక్కుపోవాల్సి వచ్చిందని, దారుణమైన నరకాన్ని అనుభవించానని ఆవేదనగా చెప్పాడు రోట్ష్క్‌. ఫారెస్ట్‌ దోమలుగా పిలిచే ఈ ఆసియా టైగర్‌ దోమలు పగటిపూటే దాడి చేస్తాయని, దయచేసి వాటి పట్ల బహు జాగ్రత్తగా ఉండాలని రోట్ష్క్‌ అందర్నీ కోరుతున్నాడు. 

(చదవండి: షాకింగ్‌ ఘటన: జడ్జి, ఆమె భర్త, పెంపుడు జంతువులతో సహా మృతి)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top