జీ-7: ముగిసిన మోదీ పర్యటన.. ఏమన్నారంటే | Modi Says Had A Very Productive Day At The G7 Summit Leaves For India, Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

జీ-7: ముగిసిన మోదీ పర్యటన.. ఏమన్నారంటే

Published Sat, Jun 15 2024 8:30 AM | Last Updated on Sat, Jun 15 2024 12:25 PM

modi says Had a very productive day at the G7 Summit leaves for India

రోమ్‌: ఇటలీలోని అపులియాలో జరుగుతున్న జీ-7 దేశాల సమ్మిట్‌ తొలిరోజు పాల్గొనటం చాలా అద్భుతం అనిపించిందని ప్రధాని మోదీ అన్నారు.  ఇటలీలోని అపులియాలో నిర్వహిస్తున్న మూడు రోజుల జీ-7 దేశాల సమ్మిట్‌ తొలిరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరై.. పలువురు దేశాధినేతలతో భేటీ నిర్వహించారు.

రోజంతా ఆయా దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇక.. జీ-7 దేశాల సమ్మిట్‌ పర్యటన ముగించుకొని ప్రధాని మోదీ ఇండియాకు బయల్దేరారు. ఈ సందర్భంగా మోదీ ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు.

చదవండి: స్వేచ్ఛా వాణిజ్యంపై మోదీ, రిషీ సమీక్ష

 

‘ఇటలీలోని అపులియాలో జరిగిన G-7 సమ్మిట్‌లో చాలా ఉత్పాదకమైన రోజు. ప్రపంచ నాయకులతో  భేటీ అయ్యాను. పలు దేశాధినేతలతో వివిధ అంశాలపై చర్చించాను. గ్లోబల్ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చే ప్రభావవంతమైన పరిష్కారాలను రూపొందించటం, భవిష్యత్తు తరాలకు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించడం మా లక్ష్యం.  ఇటలీ ప్రజలు, ప్రభుత్వం సాదరమైన ఆతిథ్యానికి ధన్యవాదాలు’ అని మోదీ అన్నారు. 

చదవండి:  ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌తో చర్చలు

చదవండి: జీ-7: కృత్రిమ మేధపై పోప్‌ ఆందోళన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement