చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు.. మళ్లీ దశల వారిగా లాక్‌డౌన్‌

Massive Spike In Covid-19 Cases In China Start Phased Lockdown - Sakshi

China to Start Phased Lockdown: చైనా కొత్త కరోనా వేరియంట్‌కి సంబంధించిన కేసులు అనుహ్యంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలేని విధంగా చైనాలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చైనా అమలు చేసిన జీరో కోవిడ్‌ టోలరెన్స్‌ విధానాన్ని పటాపంచల్ చేస్తూ మరీ విజృంభిస్తోంది. అంతేగాదు పరిస్థితిని వారంలోగా అదుపులోకి తీసుకొస్తామని చైనా అధికారులు కూడా ప్రకటించారు. కానీ చైనాలోని పరిస్థితి చూస్తే ఇప్పడప్పుడే అదుపులోకి వచ్చే స్థితి  ఏ మాత్రం కనబడటం లేదు.

దీంతో చైనా దశలవారిగా లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించింది. ఇంతవరకు చైనా దేశవ్యాప్తంగా సుమారు 13 ప్రధాన నగరాల్లో పూర్తిగా లాక్‌డౌన్‌ విధించిన సంగతి విదితమే. పైగా అతిపెద్ద నగరం షాంఘైలో కొద్ది మొత్తంలో ఆంక్షల సడలింపుతో లాక్‌డౌన్‌ విధించింది. కానీ ఇప్పడూ షాంఘైలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా దశాలవారిగా ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. అంతేకాదు 17 మిలియన్లకు పైగా జనాభా ఉన్న షాంఘైటోని షెన్‌జెన్‌ నగరంలో వేగంగా పెరుగుతున్న కోవిడ్‌ కేసుల దృష్ట్యా పూర్తిగా మూసివేసింది.

పైగా ఇక్కడ కరోనా మొదటి వేవ్ మాదిరిగా వేగంగా కేసులు నమోదవుతున్నాయి. అంతేకాదు ఈ షెన్‌ జెన్‌ నగరంలో పరిస్థితిని అదుపులో తెచ్చే విషయమై చైనా మూడు రౌండ్ల కోవిడ్‌-19 పరీక్షలు కూడా నిర్వహిస్తోంది. ఈ మేరకు ఉద్యోగులను ఇంటి నుంచే విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీ చేసింది కూడా. అంతేకాదు రోజు వారీ అవసరాలకు మాత్రమే బయటకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది కూడా.

(చదవండి: రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు.. ప్రధానంగా ఆ దేశాల్లోనే..)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top