Doorway On Mars Mystery: అంగారకుడి మీద తలుపు మిస్టరీ! ఏలియన్ల పనేనంటూ ప్రచారం.. అసలు సంగతి ఇది..

Mars Doorway Not Belongs To Aliens Here Is The Truth - Sakshi

అంగారక గ్రహం మీద తలుపులాంటి నిర్మాణం(డోర్‌వే) ఉన్న ఓ ఫోటోను తాజాగా నాసా విడుదల చేసింది. మార్స్‌ రోవర్‌ క్యూరియాసిటీ తీసిన ఈ ఫొటోలో ఒక పెద్ద బండరాయికి ఎవరో చెక్కినట్లు ఉన్న ఆ తలుపు నిర్మాణం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఇది ఏలియన్‌లు నిర్మించిందేంటూ ప్రచారం మొదలైంది. 

మార్స్‌ మీద ఏలియన్ల ఉనికి ప్రచారం ఈనాటిది కాదు. తరచూ ఏలియన్ల ఉనికిని ప్రస్తావిస్తూ బోలెడన్ని కథనాలు వెలువడేవి. అయితే తాజాగా బయటపడిన తలుపు తరహా నిర్మాణం మాత్రం ఆ వాదనను బలంగా సమర్థించింది. అది ఏలియన్ల పనేనంటూ  వాదించడం మొదలుపెట్టారు కొందరు. ఈ తరుణంలో  డోర్‌వే మిస్టరీని చేధించే పనిలోకి దిగారు పరిశోధకులు. 

చివరికి అదొక రాయి భాగం మాత్రమే అని తేల్చారు. సాధారణంగా.. అంగారకుడి మీద భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ క్రమంలో మే 4వ తేదీన కూడా భారీ భూకంపం సంభవించినట్లు నాసా గుర్తించింది. ఈ నేపథ్యంలో అలాంటి రాయి భాగం ఏదైనా ఆ తరహా నిర్మాణంలో ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాదు రోవర్‌ దానిని ప్రత్యేకమైన యాంగిల్‌లో ఫొటో తీయడం వల్లే.. అదంతా ప్రత్యేకంగా ఏదో తలుపు నిర్మాణం లాగా కనిపించింది. మార్స్‌పై ఇలాంటి భాగాలు చాలానే ఉన్నాయని నాసా నిర్ధారించింది.  

ఇక డోర్‌ తరహా బండరాయి ఫొటోల ద్వారా చూడడానికి పెద్దదిగా కనిపిస్తున్నప్పటికీ.. వాస్తవానికి అది సెంటీమీటర్లు లేదంటే ఇంచుల్లో మాత్రమే ఉంటుందని, అదేంటో పూర్తిస్థాయిలో అంచనాకి రావడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని నాసా స్పష్టం చేస్తోంది.

చదవండి: చంద్రుడిపై పచ్చదనం.. మొలకెత్తిన విత్తనాలు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top