సముద్రాన్నే నివాసంగా..నీటి అడుగున 100 రోజులు జీవించనున్న మనిషి | Sakshi
Sakshi News home page

సముద్రాన్నే నివాసంగా..నీటి అడుగున 100 రోజులు జీవించనున్న మనిషి

Published Sat, Mar 18 2023 9:07 PM

Man Decided Live Deep Sea Under Water For 100 Days - Sakshi

పురాణాల్లో వింటుంటాం సముద్రాల్లో నీటి అడుగున జీవించే మనుషుల గురించి. అంతేందుకు మహాభారతంలో దుర్యోధనడు నీటి అడుగున్న ధ్యానం చేయగల ధీరుడని విన్నాం. అవన్నీ వినడమే గానీ నిజంగా ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మాములుగా ఓడల్లో సముద్ర ప్రయాణాలు రోజుల తరబడి జరిగినప్పటికీ అది నీటిపైనే కానీ అడుగున కాదు. ఐతే నీటి అడుగున జీవించగలమా అక్కడ పరిస్థితులను మన శరీరీం తట్టుకోగలదా అనే దానిపై చాలా సందేహాలు శాస్తవేత్తలను మదిలో ప్రశ్నలుగా మిగిలాయి. ఈ నేపథ్యంలోనే ఎలాగైన వాటి గురించి తెలుసుకోవాలనే కుతూహలంతో ఫ్లోరిడాకు చెందిన ప్రోఫెసర్‌ జో డిటూరి ఒక అసాధారణమైన ప్రయోగానికి నాంది పలికారు.

బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌ పీహెచ్‌డీ చేసిన డిటూరి అనేక వ్యాధులను నివారించగల మెడికల్‌ టెక్నాలజీపై  కూడా పలు పరిశోధనలు చేశారు. ఈ మేరకు ఆయన సముద్రాన్ని మూడు నెలలపాటు తన నివాసంగా మార్చుకున్నాడు. అతను సముద్రంలోని 30 అడుగుల లోతుల్లో 100 రోజులు జీవించే ప్రయాగాన్ని నిర్వహించాడు. ఈ ప్రయోగానికి నెఫ్ట్యూన్‌ 100 అని పేరు పెట్టాడు. ఈ ప్రయోగం కోసం రిటైర్డ్‌ యూఎస్‌ నేవీ కమాండర్‌ ప్రోఫెసర్‌గా ఎంచుకున్నాడు. పనిలో పనిగా మనస్తత్వ వేత్త ఈ ప్రయోగాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తాడు. అంతరిక్ష పర్యాటనకు సమానమైన వాతావరణంలో ఉన్నప్పుడూ మనిషి మానసిక స్థితి, ప్రభావాలు ఎలా ఉంటాయనేద దానిపై వారు పర్యవేక్షిస్తారు.

ఈ ప్రయోగం సక్స్‌స్‌ అయితే భూమిపై అనుభవించిన ఒత్తిడికి 1.6 రెట్ల ఒత్తిడిని అధిగమించి బతికిబట్టగట్ట గలిగితే ప్రపంచ రికార్డుగా నిలుస్తుంది. వాస్తవానికి మానవ శరీరం నీటి అడుగున ఇంత కాలం ఉండలేదని ప్రోఫెసర్‌ డిటూరి అన్నారు. కాబట్టి నా శరీరం ఏమౌవుతోందో అనేది అధ్యయనాలకు ముఖ్య భూమికగా ఉపయోగపడుతుంది. అలాగే నా శరీరాన్ని ప్రభావితం చేసే ప్రతి అంశం పరిశోధనకు ఉపకరిస్తుంది. ఒకవేళ నీటి అడుగున ఒత్తిడిని ఎదుర్కొనగలిగితే తన ఆరోగ్యం మరింత మెరుగుపడే అవకాశాలు ఉంటయని చెబుతున్నారు. ఈ మేరకు డిటూరి ఈప్రయోగాన్ని మార్చి1న ప్రారంభించారు. ఐతే తాను సూపర్‌ హ్యుమన్‌గా బయటకు వస్తానో లేదో అనేది కాస్త సందేహంగానే ఉందన్నారు.

(చదవండి: ఇమ్రాన్‌ ఖాన్‌ ఇలా కోర్టుకి వెళ్లగానే..అలా ఇంట్లోకి పోలీసులు ఎంట్రీ..)

Advertisement
 
Advertisement
 
Advertisement