ఇరాన్‌కు భారీ షాక్‌.. కోలుకోలేని దెబ్బకొట్టిన అమెరికా | US Iran War News LIVE Updates IRGC targets Hormuz | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

ఇరాన్‌కు భారీ షాక్‌.. కోలుకోలేని దెబ్బకొట్టిన అమెరికా

కువైట్‌ గగనతలం మూసివేత..

  • కువైట్‌ గగనతలం మూసివేత..
  • ఇరాన్‌ దాడుల నేపథ్యంలో కువైట్ తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది.
  • భద్రతా కారణాల వల్ల కొన్ని విమానాలను ఇతర మార్గాలకు మళ్లించారు.
  • అమెరికా తాజా వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్ చర్యలు చేపట్టినట్లు ప్రకటన.
  • బహ్రెయిన్, కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.
  • ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తమ దాడుల్లో అమెరికా సైనిక లక్ష్యాలను గురి చేసామని హెచ్చరిక.
2026-06-11 08:36:50

సైరన్ల మోత..

  • సైరన్ల మోత..
  • బహ్రెయిన్‌లో మళ్లీ హెచ్చరిక సైరన్లు మోగాయి.
  • ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
  • ఉత్తర ఇజ్రాయెల్‌లో అలర్ట్ ప్రకటించారు.
  • లెబనాన్ వైపు నుంచి క్షిపణులు ప్రయోగించినట్టు గుర్తించిన తర్వాత ప్రజలను షెల్టర్లలోకి వెళ్లమని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది.
2026-06-11 08:36:50

ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బ..

  • దక్షిణ ఇరాన్‌లోని కీలక నగరాలే లక్ష్యంగా అమెరికా బాంబుల వర్షం.
  • బందర్‌ అబ్బాస్‌ రేవు పట్టణం, ఎయిర్‌బేస్‌ సమీపంలో భారీ పేలుళ్లు
  • సిరిక్‌, మినాబ్‌, కిష్‌ దీవుల్లోని సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు.
  • ఇరాన్‌ ఆర్థిక వెన్నుముక్కపై అమెరికా దెబ్బ.
  • అసలుయొలోని ప్రముఖ పెట్రో కెమికల్‌ ప్లాంట్‌పై అమెరికా దాడులు.
  • టెహ్రాన్‌ పశ్చిమ ప్రాంతంలో మోగిన ఎయిర్‌ డిఫెన్స్‌ సైరన్లు.
  • అమెరికా దాడులపై తీవ్రంగా స్పందించిన ఇరాన్‌.
  • సరిహద్దుల్లో హైఅలర్ట్‌ ప్రకటించిన ఇరాన్‌. 
2026-06-11 07:32:57

ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు..

  • ఇరాన్‌పై అత్యంత తీవ్రంగా దాడులు జరుగుతాయి.
  • మేము వారిపై దాడులు చేస్తూనే ఉంటాం.
  • అది కూడా అత్యంత తీవ్రమైన స్థాయిలో ఉంటుంది.
  • గత కొన్ని నెలలుగా నేను ఇరాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నాను.
  • వారు ఆ ఒప్పందంపై సంతకం చేయాలి.
  • అది ఒక మంచి ఒప్పందం.
  • అణు ఆయుధాన్ని కలిగి ఉండే హక్కును అది వారికి కల్పించదు.
  • వాస్తవానికి, వారు ఎప్పటికీ అణు ఆయుధాన్ని కలిగి ఉండకుండా అది పూర్తిగా నిషేధిస్తుంది.
2026-06-11 07:20:10

ట్రంప్‌ హెచ్చరిక..

  • ట్రంప్‌ హెచ్చరిక..
  • అమెరికా అపాచీ హెలికాప్టర్‌ కూలిన ఘటనకు ప్రతీకారంగా ఇరాన్‌పై దాడులు.
  • ఇరాన్‌ చమురు ట్యాంకర్‌ లక్ష్యంగా దాడి చేసిన అమెరికా దళాలు.
  • అవసరమైతే దాడులు కొనసాగుతాయని ట్రంప్‌ హెచ్చరిక.
  • ఇరాన్‌ చర్చలకు ముందుకు రావాలని అమెరికా అ‍ల్టిమేటం.
  • ఇరాన్‌ స్పందన ఇలా..
  • బెదిరించినంత మాత్రాన చర్చలు జరపం: ఇరాన్‌ రాయబారి
  • చర్చలపై మా వైఖరిని పున:సమీక్షిస్తాం: ఇరాన్‌ విదేశాంగ శాఖ
  • అమెరికా-ఇరాన్‌ ఘర్షణల కారణంగా భారీగా పెరిగిన ముడి చమురు ధరలు.
  • యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 25 శాతానికిపైగా పెరిగిన చమురు ధరలు. 
2026-06-11 07:12:20

ప్రపంచదేశాలకు ఇరాన్‌ మరోసారి పెద్ద షాక్‌

  • హర్ముజ్‌ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటన.
  • అమెరికా తాజా వైమానిక దాడులకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్‌ సంయుక్త సైనిక కమాండ్‌ వెల్లడి.
  • ఇకపై చమురు ట్యాంకర్లు, సరుకు రవాణా నౌకలు, వాణిజ్య నౌకలకు హర్ముజ్‌ మార్గంలో ప్రయాణం నిరాకరణ.
  • నిషేధాన్ని ఉల్లంఘించి ఎవరైనా హర్ముజ్‌ జలసంధిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే దాడులు చేస్తామని హెచ్చరిక.
  • ఈ ప్రకటనతో గల్ఫ్‌ ప్రాంతంలో ఉద్రిక్తతలు
  • ఇటు అంతర్జాతీయంగానూ తీవ్ర ఆందోళన నెలకొంది.
  • సౌదీ అరేబియా, ఇరాక్‌, కువైట్‌, యూఏఈ, ఖతార్‌ వంటి గల్ఫ్‌ దేశాల ఇంధన ఎగుమతులకు ఇదే ప్రధాన మార్గం.
  • అందుకే హర్ముజ్‌ మూసివేత ప్రపంచ ఇంధన మార్కెట్లకు భారీ షాక్‌గా మారింది.

 

2026-06-11 07:04:49

ఇరాన్‌ ప్రతీకార దాడులు..

  • అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌ దాడులు.
  • బహ్రెయిన్‌, జోర్డాన్‌, కువైట్‌ తదితర దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లతో దాడి
  • అయితే ఆ దేశాలు చాలా వరకు వాటిని అడ్డుకున్నట్లు ప్రకటన.
  • ఈ పరిణామాలతో గల్ఫ్‌ ప్రాంతమంతా హైఅలర్ట్‌

 

2026-06-11 07:01:36

ఇరాన్‌ ఆగ్రహం..

  • అమెరికా చర్యలపై ఇరాన్‌ తీవ్ర ఆగ్రహం
  • అమెరికా తప్పుడు నెపాలతో దాడులకు పాల్పడుతోందని ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియన్‌ ఆరోపణ.
  • ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కూడా ఈ దాడులను ఖండిస్తూ తగిన ప్రతిస్పందన ఇస్తామని హెచ్చరిక. 
     
2026-06-11 07:00:02

భారీ పేలుడు..

  • తాజా దాడుల్లో హర్మోజ్‌గాన్‌ ప్రావిన్స్‌లోని సిరిక్‌, మినాబ్‌, ఖేష్మ్‌ దీవి, జాస్క్‌ పోర్టు పరిసర ప్రాంతాల్లో పేలుళ్లు
  • బందర్‌ అబ్బాస్‌ సమీపంలో కూడా వైమానిక హెచ్చరిక వ్యవస్థలు చురుగ్గా పనిచేసినట్లు ఇరానియన్‌ మీడియా వెల్లడి.
  • పలు రాడార్‌ కేంద్రాలు, వైమానిక రక్షణ స్థావరాలు లక్ష్యంగా అమెరికా దాడులు.
2026-06-11 07:00:02

అమెరికా రక్షణ శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

  • అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్‌ హెగ్‌సెత్‌ కీలక వ్యాఖ్యలు..
  • ఇరాన్‌ చర్చలకు ముందుకు రాకపోతే ఇక బాంబులతోనే మాట్లాడాల్సి వస్తుంది
  • అమెరికా దాడులు ఇరాన్‌ సామర్థ్యాలను దెబ్బతీసేలా, తమ సైనిక కార్యకలాపాలకు అనుకూల పరిస్థితులు సృష్టించేలా కొనసాగుతాయి.
  • ఆయన చేసిన హెచ్చరిక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
2026-06-11 06:56:49

అమెరికా భీకర దాడులు..

  • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.
  • ఇరాన్‌ చర్చల ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని ఆరోపిస్తూ అమెరికా ఇరాన్‌పై భీకర దాడులు.
  • దీంతో కాల్పుల విరమణ నామమాత్రంగానే మిగిలి.. పరిస్థితి మళ్లీ యుద్ధానికి దారి తీసింది.
  • అమెరికా బలగాలు దక్షిణ ఇరాన్‌లోని పలు కీలక లక్ష్యాలపై భారీ వైమానిక దాడులు
  • హర్ముజ్ జలసంధికి సమీపంలోని వ్యూహాత్మక ప్రాంతాలు, రాడార్ కేంద్రాలు, 
  • వైమానిక రక్షణ వ్యవస్థలు, సైనిక మౌలిక సదుపాయాలే ప్రధాన టార్గెట్‌గా దాడులు
2026-06-11 06:55:23

ఇరాన్‌, అమెరికా యుద్ధం మళ్లీ ప్రారంభం..

  • ఇరాన్‌, అమెరికా మధ్య మళ్లీ యుద్ధం ప్రారంభం
  • ప్రపంచం దేశాలకు షాకిచ్చిన ఇరాన్‌ 
2026-06-11 06:50:13
Advertisement
 
Advertisement
Advertisement