సింహం దండయాత్ర: దాక్కున్నా వదల్లేదు!

Lion Claws: Dig For Pig.. Warthog Life Ends In Nairobi National Park - Sakshi

అటవీ ప్రాంతంలో జరుగుతున్న విన్యాసాలు, అద్భుతాలు చూడాలంటే రెండు కళ్లు చాలవు. ఆహారం కోసం జంతువులు చేసే పోరాటం అబ్బురపరుస్తుంటాయి. తాజాగా ఓ సింహం జూలు విదిల్చి ఏడు గంటల పాటు శ్రమించి చివరకు అడవి పందిని చేజిక్కించుకుని తన బొజ్జ నింపేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. భూమిలో దాగి ఉన్న ఆఫ్రికన్‌ పందిని వెలికితీసి మరి సింహం చంపి తిన్నది. ఈ వీడియో చూస్తే నిజంగా సింహం సింహామే అని అంటారు.

కెన్యా దేశ రాజధాని నైరూబీలోని మసాయి మరా జాతీయ పార్కులో సింహం ఆహారం కోసం వేట సాగిస్తోంది. సాధారణంగా ఆఫ్రికన్‌ పందులు భూమిలో దాగి ఉంటాయి. బురద ప్రాంతంలో దాగి ఉన్న వాటిని సింహం గుర్తించింది. దీంతో తీవ్ర ఆకలి మీద ఉన్న సింహం గుంత తవ్వడం మొదలుపెట్టింది. మనిషి మాదిరి తవ్వుతూ.. తవ్వుతూ దాదాపు ఏడు గంటలపాటు నిర్విరామంగా తవ్వేసింది. అనంతరం ఆ గుంతలో ఉన్న ఆఫ్రికన్‌ జాతి పందిని పట్టేసింది. సింహం బారి నుంచి కాపాడేందుకు ఆ పంది ఎంత ప్రయత్నం చేసినా సింహం పట్టు వదలలే. చివరకు పంది ఓడింది.. సింహం గెలిచింది. అడవి రాజు సింహం ఆకలి తీరింది. దీనికి సంబంధించిన వీడియోను సేల్స్‌ ఇంజనీర్‌ సుహేబ్‌ అల్వీ తీసి సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top