ద.కొరియా అధ్యక్షుడిగా లీ జే మ్యుంగ్‌ | Lee Jae-myung set to be South Korea President as opponent concedes defeat | Sakshi
Sakshi News home page

ద.కొరియా అధ్యక్షుడిగా లీ జే మ్యుంగ్‌

Jun 4 2025 5:13 AM | Updated on Jun 4 2025 5:13 AM

Lee Jae-myung set to be South Korea President as opponent concedes defeat

సియోల్‌: దక్షిణ కొరియాలో కొద్దినెలలుగా నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. మంగళవారం నిర్వహించిన అధ్యక్ష ఎన్నికల్లో విపక్ష డెమొక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ కొరియా పారీ్టకి చెందిన లీ జే మ్యుంగ్‌ విజయం సాధించారు. అధికార పార్టీ నేత, పీపుల్‌ పవర్‌ పార్టీ అభ్యర్థి కిమ్‌ మూన్‌ సూ ఓడిపోయారు.

గత డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా అత్యయిక స్థితి(మార్షల్‌ లా) విధించి పరువుతో పాటు అంతిమంగా పదవి సైతం కోల్పోయిన పదవీచ్యుత యూన్‌ సుక్‌ యెల్‌ స్థానంలో ఓటర్లు తమ నూతన దేశాధ్యక్షుడిగా మ్యుంగ్‌ను ఎన్నుకున్నారు. అయితే చిరకాల మిత్రదేశాలు అమెరికా, జపాన్‌లకు బదులుగా చైనా, ఉత్తరకొరియాలకు అనుకూలంగా మాట్లాడతారనే అపవాదు మ్యుంగ్‌కు ఉంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement