మా దేశానికి రండి.. మూన్‌కు కిమ్‌ ఆహ్వానం

North Korea's Kim invites South Korean president for summit: South Kor - Sakshi

గ్యాంగ్నెయుంగ్‌: దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ను తమ దేశంలో పర్యటించాల్సిందిగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆహ్వానించారు. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో జరగబోయే సదస్సుకు హాజరు కావాలని మూన్‌ను కోరారు. ఉత్తర కొరియా విదేశాంగ మంత్రితో కలసి కిమ్‌ సోదరి యో జోంగ్‌ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు.

ఈ సందర్భంగా కిమ్‌ పంపిన ఆహ్వాన లేఖను మూన్‌కు అందించారు. సదస్సుకు వెళ్తారా లేదా అనే దానిపై మూన్‌  స్పందించలేదు. అయితే గతేడాది అమెరికా అధ్యక్షుడు ట్రంప్, కిమ్‌లు వ్యక్తిగత దూషణలకు సైతం దిగడం తెల్సిందే. ఈ నేపథ్యంలో అమెరికాకు మిత్రదేశమైన దక్షిణ కొరియా అధ్యక్షుడు ఉ.కొరియాకు వెళ్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వెళితే మూన్‌ ట్రంప్‌ ఆగ్రహానికి గురికావాల్సి రావొచ్చని పలువురు విశ్లేషిస్తున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top