మరోసారి అమెరికా ట్రావెల్‌ ఆంక్షలు ?

Joe Biden set to reimpose travel ban on UK and EU - Sakshi

కోవిడ్‌ కట్టడి కోసం బైడెన్‌ ప్రభుత్వం చర్యలు!

వాషింగ్టన్‌: కోవిడ్‌ కట్టడి చేసే విషయమై బైడెన్‌ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో బ్రెజిల్, ఐర్లాండ్, యూకేలతో సహా 26 ఇతర యూరోపియన్‌ దేశల నుంచి వచ్చే అమెరికా యేతర పౌరుల ప్రయాణాలపై మరోసారి ఆంక్షలు విధించేందుకు సిద్ధమౌతున్నట్టు అమెరికా వైట్‌ హౌస్‌ అధికారులు వెల్లడించారు. దక్షిణాఫ్రికా నుంచి వ్యాపించిన కరోనా వైరస్‌పై ఆందోళనలు నెలకొనడంతో ఆంక్షల జాబితాలో దక్షిణాఫ్రికాని కూడా చర్చనున్నట్టు తెలుస్తోంది. అధ్యక్ష స్థానాన్ని వీడే చివరి రోజుల్లో మంగళవారం నుంచి ట్రావెల్‌ ఆంక్షలను సడలిస్తున్నట్టు ప్రకటించిన డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాలను తిప్పికొట్టిన అమెరికా నూతన అ«ధ్యక్షుడు బైడెన్, తిరిగి ప్రయాణ ఆంక్షలను విధించేందుకు సిద్ధమౌతున్నారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top