‘కంగారు పడొద్దు.. తర్వాత నువ్వే’.. నవలా రచయిత్రికి బెదిరింపులు.. | JK Rowling gets Islamic death threat on Twitter | Sakshi
Sakshi News home page

‘కంగారు పడొద్దు.. తర్వాత నువ్వే’.. నవలా రచయిత్రి జేకే రౌలింగ్‌కు బెదిరింపులు

Aug 14 2022 4:39 AM | Updated on Aug 14 2022 7:47 AM

JK Rowling gets Islamic death threat on Twitter - Sakshi

లండన్‌: బ్రిటిష్‌ నవలా రచయిత్రి జేకే రౌలింగ్‌(57)కు పాకిస్తాన్‌కు చెందిన ఇస్లామిక్‌ ఉగ్రవాది ట్విట్టర్‌ వేదికగా చంపుతామంటూ బెదిరించడం కలకలం రేపింది. శుక్రవారం అమెరికాలో సల్మాన్‌ రష్దీపై హత్యాయత్నం ఘటనపై జేకే రౌలింగ్‌ విచారం వ్యక్తం చేశారు. ‘తీవ్ర వేదనకు గురయ్యాను. ఆయన క్షేమంగా ఉండాలి’ అని ట్వీట్‌చేశారు. దీనిపై కరాచీకి చెందిన మీర్‌ ఆసిఫ్‌ అజీజ్‌ అనే వ్యక్తి స్పందిస్తూ..

‘కంగారు పడొద్దు.తర్వాత నువ్వే’ అనే బెదిరింపుతో కూడిన వ్యాఖ్యలు చేశాడు. జేకే రౌలింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక కార్యకర్త, రాజకీయ కార్యకర్త, విద్యార్థిగా తనకు తాను పేర్కొనే ఆసిఫ్‌ అజీజ్‌ ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీకి మద్దతుగా పోస్టులు పెడుతుంటాడని అధికారులు తెలిపారు. ఇతడి దృష్టిలో భారత్, ఇజ్రాయెల్, ఉక్రెయిన్‌లు ఉగ్రవాద దేశాలని తెలిపారు. వాటిని ఎలా నాశనం చేయాలనే దానిపై కుళ్లు జోకులు వేస్తుంటాడన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement