భారత్‌ను బెదిరించిన ఉగ్రవాది అబ్దుల్‌ అజీజ్‌ మృతి! | Jaish e Mohammed Terrorist Found Dead In Pakistan, Check Out Video And More Details Inside | Sakshi
Sakshi News home page

భారత్‌ను బెదిరించిన ఉగ్రవాది అబ్దుల్‌ అజీజ్‌ మృతి!

Jun 3 2025 4:20 PM | Updated on Jun 3 2025 4:55 PM

Jaish e Mohammed Terrorist Found Dead in Pakistan

లాహోర్‌:  భారత్‌ను విచ్ఛిన్నం చేస్తామంటూ ఇటీవల  బెదిరింపులకు పాల్పడిన జైఫే మహ్మద్‌ ఉగ్రవాది అబ్దుల్‌ అజీజ్‌ మృతిచెందాడు.  ఈ విషయాన్నిజైషే మహ్మద్‌ ఉగ్రవాద సంబంధిత సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ ధృవీకరించాయి ఆ సోషల్‌ మీడియా  హ్యాండిల్స్‌ లో ఉగ్రవాది అబ్దల్‌ అజీద్‌ మృతిచెందిన విషయాన్ని వెల్లడించడంతో పాటు అతని అంత్యక్రియలు బహవల్పూర్‌ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.  కార్డియక్‌ అరెస్టుతో అబ్దుల్‌ అజీజ్‌ మృతి చెందినట్లు సమాచారం. 

ఇటీవల పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో దాయాది దేశానికి చెందిన తొమ్మిది ప్రాంతాల్లో దాడులు చేసింది, అందులో ఉగ్రవాది అబ్దల్‌ అజీజ్‌ అంత్యక్రియలు నిర్వహించనున్న బహవల్పూర్‌ ఒకటి.

అయితే ఉగ్రవాది అబ్దుల్‌ అజీజ్‌ మృతిచెందిన విషయాన్ని పాకిస్తాన్‌ ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు.  ఉగ్రవాదాన్ని పాకిస్తాన్‌ పెంచి పోషిస్తుందని ప్రపంచ దేశాల ముందు చులకనైన  ఆ దేశం.. ఉగ్రవాది అబ్దుల్‌ అజీజ్‌ మృతిపై మాట్లాడకుండా ఉండటమే మేలు అనే భావనలోనే ప్రకటనలకు దూరంగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.  దాంతోనే పాకిస్తాన్‌ అధికారులు  ఈ ఘటనపై ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement