ఇజ్రాయెల్ భీకర దాడి.. వందల సంఖ్యలో మృతులు | Israel fierce attack on Lebanon | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్ భీకర దాడి.. వందల సంఖ్యలో మృతులు

Apr 8 2026 7:34 PM | Updated on Apr 8 2026 7:59 PM

Israel fierce attack on Lebanon

లెబనాన్‌పై ఇజ్రాయెల్‌, విరుచుకపడుతుంది. కేవలం 10 నిమిషాల్లో 100కు పైగా వైమానిక దాడులు  చేసింది. ఈా దాడులలో వందల సంఖ్యలో ప్రజలు మృతిచెందగా, పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. అదే విధంగా పెద్ద మెుత్తంలో ప్రజలు గాయపడ్డారు. 1982 తర్వాత లెబనాన్‌పై ఇదే అతిపెద్ద దాడిగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ దాడిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

అయితే కొద్ది సేపటి క్రితమే ఇజ్రాయెల్‌ను ఇరాన్ హెచ్చరించింది. లెబనాన్‌పై దాడులు ఆపకపోతే టెల్‌ అవీవ్‌ పై  దాడి చేస్తామని హెచ్చరించింది. కాగా ప్రస్తుతం సీజ్‌ఫైర్‌ ఒప్పందం కేవలం ఇరాన్‌పై దాడికి సంబంధించింది మాత్రమేనని లెబనాన్‌పై దాడులు చేస్తామని ఇజ్రాయెల్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో మరోసారి వార్‌ టెన్షన్‌ నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement