వీటిని ఎక్కడపడితే అక్కడ చూడలేం

Island North Pole Larin Ray Photo - Sakshi

ఉత్తర ధృవ కాంతులు.. ఇవి ప్రకృతి గీసే చిత్రాలు.. అలాగని వీటిని ఎక్కడపడితే అక్కడ చూడలేం కూడా.. నార్వే, ఐస్‌లాండ్‌లాంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇవి కనిపిస్తున్నాయి. ఇక్కడ నేలపై వాటి ప్రతిబింబం కూడా పడటంతో మరింత అందాన్ని సంతరించుకుంది. ఈ ఏడాది ఆస్ట్రానమీ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ తుది జాబితాకు ఎంపికైన చిత్రాల్లో ఇదీ ఒకటి. ఐస్‌లాండ్‌లో  లారిన్‌ రే అనే ఫొటోగ్రాఫర్‌ దీన్ని తీశారు. తన జీవితంలో తీసిన ఉత్తర ధృవ కాంతుల చిత్రాల్లో ఇది బెస్ట్‌ అని లారిన్‌ చెప్పారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top