పాకిస్థాన్‌కు ఇరాన్ షాకిచ్చింది. టెహ్రాన్ అనుమతి లేకుండా హర్మూజ్ జలసంధి దాటుతున్న పాక్‌కు చెందిన చమురు షిప్‌ను పేల్చేసింది. యుద్ధానికి మధ్యవర్తిత్వం వహిస్తామంటూ పాక్ బీరాలు పలుకుతున్న వేళ ఇరాన్ దాడి చేయడం ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది.
పశ్చిమాసియా యుద్ధం ఇంతట్లో శాంతించేలా లేదు. ఇరాన్ చర్చలకు ఎట్టి ససేమిరా అంటూ దాడులకు తెగబడుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చల మంత్రం జపించినా టెహ్రాన్ శాంతించడం లేదు. ఓ వైపు ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తుంది. అమెరికా ఆర్మీ సైతం తమ దేశంలో దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.
తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఓ చమురు నౌకను ఇరాన్ ధ్వంసం చేసింది. దుబాయ్, అబుదాబీ సముద్ర తీరంలో ఈ అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే రెండురోజుల క్రితం హర్మూజ్‌లో పాకిస్థాన్ నౌకను ఇరాన్ అడ్డుకోవడం తెలిసిందే. అనుమతి లేకుండా నౌక జల సంధి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించడంతోదానిని అడ్డుకున్నట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ ప్రకటించింది.
తాజాగా పాక్‌కు చెందిన మరో చమురు నౌకపై దాడి చేసి ధ్వంసం చేసింది. అయితే ఇరాన్‌తో తమకు సత్సంబంధాలున్నాయని యుద్ధానికి మధ్యవర్తిత్వం వహిస్తామని పాకిస్థాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ దేశానికి చెందిన నౌకపైనే దాడి చేయడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పాకిస్థాన్ ఎలా స్పందిస్తోందో తెలియాల్సి ఉంది. మరోవైపు భారత్‌కు చెందిన నౌకలకు ఇరాన్ హర్మూజ్ జలసంధి దాటడానికి అనుమతిస్తోంది.
🚨🚨 Just in Breaking 🇵🇰
Iran destroys Pakistan oil tanker that attempted to pass through the Strait of Hormuz without permission.....See more pic.twitter.com/kvYfaniJeJ— INN Iran National News (@INNewx) March 27, 2026


