పుతిన్‌కు ఘోర అవమానం.. పూలను ఛీ కొట్టిన రష్యన్‌ మహిళలు

Insult To Putin: Flowers For Russian Women Rejects Amid Ukraine War - Sakshi

ఉక్రెయిన్‌పై సైనిక చర్యతో పాశ్చాత్య దేశాల దృష్టిలోనే కాదు.. సొంత దేశంలోనూ కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌. ఆంక్షలు ఇప్పటికే రష్యాకు ఆర్థికంగా ప్రభావితం చేస్తుండగా.. మరోవైపు రష్యన్‌ సోషల్‌మీడియా పుతిన్‌కు వ్యతిరేకంగానే కూస్తోంది. ఈ క్రమంలో.. 

పుతిన్‌కు ఘోర అవమానం.. అదీ సొంత గడ్డపైనే జరిగింది. మహిళా దినోత్సవం వేడుకల్ని Russia లో పలు చోట్ల బహిష్కరించారు. సాధారణంగా.. ఉమెన్స్‌ డే వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తుంటాడు పుతిన్‌. కానీ, ఈసారి ఈ వేడుకల్లో చేదు అనుభవం ఎదురయ్యింది.

పుతిన్‌ లక్ష పువ్వుల పంపకం ఈసారి బెడిసి కొట్టింది. వలంటీర్ల సాయంతో మాస్కో నగరంలో మహిళలకు లక్ష పువ్వుల్ని పంచడం ఆనవాయితీగా కొనసాగిస్తోంది అక్కడి ప్రభుత్వం. మహిళా డ్రైవర్లు, ఇతర సిబ్బందికి వలంటీర్ల సాయంతో పూలు పంచాలంటూ అధ్యక్ష భవనం నుంచే ఈ ఆదేశాలు వెలువడుతుంటాయి కూడా. అయితే.. ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో చాలామంది పువ్వుల్ని తీసుకోవడానికి నిరాకరించారట. ఈ విషయాన్ని టాస్‌ న్యూస్‌ ఏజెన్సీ ప్రముఖంగా ప్రచురించింది.  
   
పువ్వులతో పాటు ఫ్లవర్‌ బొకేలను సైతం తిరస్కరించారట. అంతేకాదు కొన్నిచోట్ల వాటిని చెత్త కుప్పల్లోనే పడేసిన దృశ్యాలు సైతం వైరల్‌ అయ్యాయి అక్కడ. సోషల్‌ మీడియాలో పుతిన్‌ యుద్ధకాంక్షను ఛీ కొడుతూ.. ఆ వ్యతిరేకత తారాస్థాయిలో కనిపించింది. దీంతో ఆ పోస్టులు, ఫొటోల్ని తొలగించాలని రష్యన్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  ఇదిలా ఉంటే.. మంగళవారం రాత్రి ఉమెన్స్‌ డే సందర్భంగా.. మహిళా మిలిటరీ, వైద్య సిబ్బందిని ఉద్దేశించి పుతిన్‌ ప్రసగించిన కార్యక్రమానికి టీఆర్పీ దారుణంగా పడిపోవడం సైతం చర్చనీయాంశంగా మారింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top