అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న కొత్త కరోనా: ఈ లక్షణాలుంటే..!

Highly contagious new Covid variant HV1 spreading across US do you have This symptom - Sakshi

యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా  మహమ్మారి అమెరికాలో మరోసారి వేగంగా విస్తరిస్తోంది.   అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ హెచ్‌వీ.1  అమెరికన్లను భయపెడుతోంది. యూఎస్‌ సెంటర్స్‌  ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నుండి వచ్చిన డేటా ప్రకారం అక్టోబర్ 28తో ముగిసిన రెండు వారాల వ్యవధిలో కొత్తగా నిర్ధారణ అయిన కేసుల్లో 25.2 శాతం  ఈ వేరియంట్ కారణమని  తేల్చింది.

గతంలో ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరించిన ఈజీ.5 అకా ఎరిస్ వేరియంట్ల కంటే ఈ హెచ్‌వీ.1 వేరియంట్ ఎక్కువ డామినెంట్‌ వేరియంట్‌ అని, ఇటీవల నమోదైన కేసుల్లో నాలుగో వంతు కంటే మించి హెచ్‌వీ.1 వేరియంట్ కేసులేనని గుర్తించారు. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తాజా గణాంకాల ప్రకారం జూలైలో  0.5 శాతంగా ఉన్న ఈ వేరియంట్ కేసులు సెప్టెంబర్ నాటికి అవి 12.5 శాతానికి పెరిగాయి. దీన్ని ఒమిక్రాన్‌ గ్రాండ్‌ చైల్డ్‌గా వాండర్‌బిల్ట్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్‌లోని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ప్రొఫెసర్ డా. విలియం షాఫ్నర్ పేర్కొన్నారు. అలాగే పిలోరా జేఎన్‌.1 వేరియంట్‌ను ఐస్‌లాండ్, పోర్చుగల్, స్పెయిన్‌తో సహా 12 దేశాలలో కనుగొన్నారు.

కోవిడ్‌ టంగ్‌
ఈ వేరియంట్ సోకిన వారిలో గొంతు నొప్పి, జలుబు, దగ్గు, తలనొప్పి, అలసట, కండరాల నొప్పి, చలి లాంటివి  కోవిడ్‌లో కీలక లక్షణాలు.  అయితే, ఈ కొత్త వేరియంట్‌ సోకిన వారి నోటిలో కోవిడ్‌ టంగ్‌ లక్షణం కనిపిస్తోందని ఆరోగ్య నిపుణుల అభిప్రాయాన్ని ఉటంకిస్తూ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా  నివేదించింది. దీని ప్రకారం ఒమిక్రాన్‌  హెచ్‌వీ.1, పిరోలా జాతి జేఎన్‌.1 వేరియంట్స్‌ బారిన పడిన వారిలో నాలుక వాపు లేదా మంట ముఖ్య లక్షణంగా ఉంటోంది. కొంతమంది రోగుల నాలుకపై  సాధారణం కంటే తెల్లని మందపాటి పొర ఏర్పడుతోంది.

దీంతోపాటు  నాలుక బాగా ఎర్రగా మారడం, మంట,  రుచి కోల్పోవడం, కొద్దిగా తిమ్మిరి కనిపించాయట. కొన్నిసార్లు నాలుకపై గడ్డలు , అల్సర్లు ఏర్పడినట్టు తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. అయిదే మన శరీరంలోని ఇమ్యూన్‌ సిస్టం  వైరస్‌తో పోరాడుతున్నదానికి సంకేతం కావచ్చని, కొంతమందికి, కొన్ని రోజుల తర్వాత వాపు దానంతట అదే తగ్గిపోతుందని తెలిపారు. మరికొంతమందికి మందులు వాడాల్సి ఉంటుందన్నారు.ఈ నేపథ్యంలో ఇలాంటి లక్షణాలుంటే వెంటనే వైద్యుణిని సంప్రదించాలని చెప్పారు.

ఈ వేరియంట్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, శాస్త్రవేత్తలు హెచ్‌వీ.1 లాంటి వేరియంట్ కొత్త వేరియంట్‌ల గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదని ఎన్‌బీసీ న్యూస్‌ రిపోర్ట్‌ చేసింది.ఎక్కువ మ్యుటేషన్‌​ అయ్యే వేరియంట్లు తక్కువ హాని కలిగిస్తాయని వీరు పేర్కొన్నారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top