గూగుల్‌కు షాకిచ్చిన ఆస్ట్రేలియా కోర్టు

Google ordered to pay Australian politician over defamatory case - Sakshi

పరువునష్టం కేసులో రూ.4 కోట్ల పరిహారం

కాన్‌బెర్రా: యూట్యూట్‌ వీడియోలు తన కెరీర్‌ను పాడు చేశాయంటూ ఓ మాజీ రాజకీయ నాయకుడు వేసిన పరువు నష్టం కేసులో ఆస్ట్రేలియా ఫెడరల్‌ కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. యూట్యూట్‌ మాతృసంస్థ గూగుల్‌కు 7.15 లక్షల ఆస్ట్రేలియా డాలర్ల (సుమారు రూ.4 కోట్లు) జరిమానా విధించింది. న్యూసౌత్‌వేల్స్‌ స్టేట్‌ మాజీ డిప్యూటీ ప్రీమియర్‌గా జాన్‌ బరిలరో పనిచేశారు.

జాన్‌ బరిలరో పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా 2020 సెప్టెంబర్‌–అక్టోబర్‌ మధ్య కాలంలో జోర్డాన్‌ షాంక్స్‌ అనే కమెడియన్‌ పలు వీడియోలు యూట్యూట్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోల కారణంగా బరిలరో రాజకీయాల నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. సదరు వీడియోలను తొలగించాలంటూ పలుమార్లు ఆయన రాసిన లేఖలను గూగుల్‌ సంస్థ పట్టించుకోలేదు. దీంతో బరిలరో కోర్టును ఆశ్రయించారు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top