రికార్డు సృష్టించిన పాక్‌.. ఏ విషయంలో తెలుసా? | global terrorism index Pakistan top place | Sakshi
Sakshi News home page

రికార్డు సృష్టించిన పాక్‌.. ఏ విషయంలో తెలుసా?

Mar 22 2026 11:11 AM | Updated on Mar 22 2026 1:42 PM

global terrorism index Pakistan top place

పాకిస్థాన్‌కు తన చేస్తున్న పనులకు తగిన గౌరవం లభించింది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో మెుదటి స్థానానికి చేరుకొని రికార్డు సృష్టించింది. గత కొన్ని సంవత్సరాలుగా టాఫ్‌ ప్లేసులో ఉన్న ఈ దేశం ఇప్పుడు ఏకంగా మెుదటి స్థానానికి చేరుకొని అశాంతికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది.

పాకిస్థాన్‌ గురించి ప్రపంచానికి తెలియజేయడానికి భారత్‌ ఇంతకాలం శాయశక్తులా ప్రయత్నిస్తూ వచ్చింది.  దాయాది దేశం కపటబుద్దిని ఉగ్రవాదులకు కల్పిస్తున్న అండదండలను అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ దేశాలకు తెలియజేసింది. అయినప్పటికీ పాక్ తన వక్రబుద్ధిని మార్చుకోకుండా భారత్‌పై విషం చిమ్ముతూ వచ్చింది. కాగా తాజాగా విడుదలైన గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ - 2026లో పాకిస్థాన్‌ మెుదటి స్థానం దక్కించుకుంది. దీంతో ఆదేశంలో ఉగ్రవాదం ఏ స్థాయిలో ఉందో అంతర్జాతీయ సమాజానికి తేటతెల్లమయ్యింది. 

కాగా గ్లోబల్‌ టెర్రరిజం ఇండెక్స్‌లో భారత్ 13వ స్థానంలో నిలిచింది. గత ఏడాది కాలంగా దేశంలో ఉగ్రవాద ఘటనలు 44 శాతం తగ్గాయని పేర్కొంది. క్రితంతో పోలిస్తే 2025లో ఉగ్రవాద మరణాలు 28 శాతం తగ్గాయి. ఉగ్రదాడుల సంఖ్య 22శాతం తగ్గి 2,944కు చేరుకుంది.  81 దేశాలలో పరిస్థితి మెరుగుపడగా 19 దేశాలలో పరిస్థితి మరింత దిగజారింది. అదే సమయంలో ప్రాశ్చాత్య దేశాలలో ఉగ్రవాద దాడులు 280 శాతం పెరిగాయి.

టెర్రరిజం అరికట్టడానికి ప్రహార్

అయితే భారత్ ఉగ్రవాదాన్ని సమూళంగా అణిచివేయడానికి తగిన చర్యలు తీసుకుంటుంది. ఫిబ్రవరి 23న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 'ప్రహార్' పేరుతో మెట్ట మెుదటి జాతీయ ఉగ్రవాద నిరోధక విధానాన్ని విడుదల చేసింది. దేశంలో ఉగ్రవాదాన్ని నిరోధించే విధంగా ఈ విధానం చర్యలు తీసుకోనుంది. ‌

ఇండెక్స్ ఏ ఆధారంగా?

గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ నాలుగు ప్రధానాంశాల ఆధారంగా గుర్తిస్తారు. సంవత్సరంలో ఆ దేశంలో జరిగిన ఉగ్రదాడుల సంఖ్య, మరణాలు, గాయపడిన వారి సంఖ్య, బందీలుగా చిక్కుకున్నవారు తదితర అంశాల ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement