Marburg virus: ఆఫ్రికాలో వెలుగులోకి ప్రాణాంతక 'మార్బర్గ్‌' వైరస్‌

Ghana confirms first cases of highly infectious Marburg virus - Sakshi

అక్ర: ప్రపంచ దేశాలను ప్రాణాంతక వైరస్‌లు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న వేళ.. మరో ప్రమాదకర వైరస్‌ బయపడటం ఆందోళన కలిగిస్తోంది. ఆఫ్రికాలోని ఘనా దేశంలో అతి ప్రాణాంతకమైన 'మార్బర్గ్‌' వైరస్‌ వెలుగు చూసింది. రెండు కేసులు బయటపడినట్లు ఆదివారం ఘనా అధికారికంగా ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం మరణించిన ఇద్దరు వ్యక్తులకు పరీక్షలు నిర్వహించగా ప్రాణాంతక వైరస్‌ నిర్ధరణ అయినట్లు పేర్కొంది. 

జులై 10నే పాజిటివ్‌గా తేలినప్పటికీ.. ఫలితాలను మరోమారు తనిఖీ చేసేందుకు సెనెగల్‌లోని ల్యాబ్‌కు పంపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. 'సెనెగల్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ పాస్టెర్‌లో నిర్వహించిన పరీక్షల్లోనూ పాజిటివ్‌గా తేలింది' అని ఘనా ఆరోగ్య విభాగం ప్రకటన చేసింది. దీంతో కేసులు వెలుగు చూసిన ప్రాంతంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టే చర్యలు చేపట్టినట్లు తెలిపింది. బాధితులతో కలిసిన వారిని ఐసోలేషన్‌కు తరలించామని, ఎవరిలోనూ వైరస్‌ లక్షణాలు కనిపించలేదని పేర్కొంది. ఆఫ్రికాలో మార్బర్గ్ వైరస్‌ వెలుగు చూడటం ఇది రెండో సంఘటన. గత ఏడాది గినియాలో తొలి కేసు నమోదైంది. ఆ తర్వాత ఎలాంటి కేసులు వెలుగు చూడలేదు. 

డబ్ల్యూహెచ్‌ఓ అప్రమత్తం.. 
ప్రాణాంతక మార్బర్గ్‌ వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. 'ఘనా ఆరోగ్య విభాగం వేగంగా స్పందించింది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇలా చేయటమే మంచిది. లేదంటే మార్బర్గ్‌ వైరస్‌ చేయిదాటిపోతుంది.' అని పేర్కొన్నారు డబ్యూహెచ్‌వో ఆఫ్రికా రీజనల్‌ డైరెక్టర్‌ మాట్షిడిసో మోటీ. మార్బర్గ్‌ వైరస్‌ సోకిన ఇద్దరు రోగులు.. ఘనాలోని సదరన్‌ అశాంతి నగర్‌కు చెందిన వారిగా తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందే ముందు వారిలో డయేరియా, శరీరంలో రక్త స్రావం, జ్వరం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించాయన్నారు.

ఇదీ చదవండి: Monkeypox Global Health Emergency: మంకీపాక్స్ ప్రమాకరమైనదేనా? కాదా! డబ్ల్యూహుచ్‌ఓ అత్యవసర సమావేశం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top