Monkeypox Global Health Emergency: మంకీపాక్స్ ప్రమాకరమైనదేనా? కాదా! డబ్ల్యూహుచ్‌ఓ అత్యవసర సమావేశం

WHO Assess Whether Monkeypox Represents a public health concern - Sakshi

జెనీవా: మంకీపాక్స్ వ్యాప్తి పై డబ్ల్యూహెచ్ఓ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఇది అంతర్జాతీయపరంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా వర్గీకరించాలా వద్దా అని నిర్ణయించడానికి జూన్‌ 23న అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తామని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌ఓ ఛీఫ్ టెడ్రోస్‌ అధనామ్‌ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ..."మంకీపాక్స్ వ్యాధులు ఎక్కువగా నమోదవ్వడంతో ఇది అసాధరణమైన వ్యాధి అని సందేహం కలుగుతోంది.

అందువల్ల ఈ విషయమై అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం అత్యవసర కమిటీని సమావేశపరచాలని నిర్ణయించాను. ఈ వ్యాప్తి అంతర్జాతీయపరంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని సూచిస్తుందో లేదో అంచనా వేయడానికే సమావేశం ఏర్పాటు చేస్తున్నాను" అని చెప్పారు. 

(చదవండి: ఆ సమాధి పై ఎరుపు రంగుతో రాసిన హెచ్చరిక... తెరిచారో అంతే...)
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top