Viral Video: భయ్యా మరి ఇంత బలుపా! మొసలి నోటికే నేరుగా..

Florida Man Hand Feeds Alligator Goes Viral On Social Media - Sakshi

మొసళ్లకు సంబంధించిన పలు వైరల్‌ వీడియోలు చూశాం. అవి ఎంత క్రూరంగా దాడి చేస్తాయో కూడా చూశాం. అంతెందుకు సరదాగా చూడటానికి వచ్చిన ఒక పర్యాటకుడిపై మొసలి ఎలా దాడి చేసి గాయపరిచిందో వంటి పలు ఘటనలు చూశాం. అయినా సరే కొంతమంది నిర్లక్ష్యంగానే ఉంటారు. అచ్చం అలానే ఇక్కడొక జంట ఎంత నిర్లక్ష్యంగా అంటే.. ఆ మొసళ్లు ఉన్న నదిలోకే వెళ్లి వాటిని పిలిచి మరీ ఆహారం పెడుతున్నారు. ఏదో పెంపుడు కుక్కకు పెట్టినట్లుగా పెట్టాడు.

ఈ ఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..బుచ్‌, పెగ్గి అనే ఒక జంట నదిలో కూర్చొని దూరం నుంచి వస్తున్న మొసళ్లును పిలుస్తూ  చేతులూ ఊపాడు. ఆ తర్వాత వాటికి పంది మాంసంతో తయారు చేసిన శాండ్‌విచ్‌లు నేరుగా చేతితో తినిపిస్తున్నాడు. ఒకవేళ దాడి చేసి ఉంటే పరిస్థితి ఇక అంతే. పైగా వారు నీళ్లలోనే ఉన్నారు తప్పించుకునే అవకాశం కూడా లేదు.

అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. దీంతో నెటిజన్లు.. ఏం భయ్యా మరి ఇంత బలుపేంటి అంటూ ఫైర్‌ అయ్యారు. అయినా ఫ్లోరిడాలో ఇలాంటివి నేరం దుష్ప్రవర్తన కింది పరిగణించి చర్యలు తీసుకుంటుందని తెలిసి కూడా ఇలా చేస్తారా మీరు అంటూ తిట్టిపోశారు. 

(చదవండి: పేరుకే పెద్ద ఆస్పత్రి..కనీసం స్ట్రెచర్‌ లేక వృద్ధుడి పాట్లు: వీడియో వైరల్‌)

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top