బుల్లెట్ నుంచి మనిషి ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌ఫోన్

five year old phone stopped a bullet and saved its owner life - Sakshi

ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్ అంటే చాలా మంది వీడియోలు చూడటం కోసం, గేమింగ్ ఆడటం కోసం, ఫోటోలు తీయడం కోసం పనికొస్తుందని అనుకుంటారు. కానీ, మనం ఇప్పుడు చెప్పుకొనే స్మార్ట్‌ఫోన్ మాత్రం ఏకంగా మనిషి ప్రాణాలే కాపాడింది. మోటరోలాకు చెందిన ఐదేళ్ల పాత మోటో జీ5 స్మార్ట్‌ఫోన్ ఒక మనిషి ప్రాణం కాపాడింది. వేగంగా వస్తున్న బుల్లెట్‌ను అడ్డుకుని బుల్లెట్ ప్రూఫ్ లా పనిచేసింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ మొబైల్ కేసు మీద ది ఇన్ క్రెడిబుల్ హల్క్ డిజైన్ ఉంది.

మార్వెల్ హీరో హల్క్, మోటో జీ5 కలిసి ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన గత వారం బ్రెజిల్‌లో దొంగతనం జరిగే సమయంలో జరిగింది. ఆ సమయంలో అక్కడున్న వ్యక్తిపై దుండగుడు బుల్లెట్ ఫైర్ చేశారు. అది నేరుగా  మోటో జీ5 స్మార్ట్‌ఫోన్‌కు తగిలి దిశ మార్చుకొని నడుము భాగంలోకి దూసుకెళ్లింది. అలా చిన్నపాటి గాయంతో బయటపడ్డ వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది. ఇది తప్ప బుల్లెట్ వల్ల మరే ఇతర గాయం లేదు. ఫోన్ యజమానికి చికిత్స చేసిన వైద్యుడు షేర్ చేసిన ఫోటో ప్రకారం మోటో జీ5 బుల్లెట్ నుంచి ప్రాణాలు కాపాడింది. బుల్లెట్ ఫోన్ స్క్రీన్ ను తాకడం మనం చూడవచ్చు. ఇప్పుడు అది పగిలిపోయింది.
 

ఫోన్ వెనుక భాగంలో పెద్ద బొడిపే కూడా ఉంది. ఫోన్ లో హల్క్ కేసు కూడా కనిపిస్తుంది. గతంలో వచ్చిన మోటో జీ5 వంటి ఫోన్లు చాలా మందంగా ఉండేవి. కానీ, ఇప్పుడు వచ్చే ఫోన్లు స్లిమ్, సున్నితమైన డిజైన్ తో వస్తున్నాయి. ఇలాంటి ఘటనల నుంచి కాపాడతాయా అనే సందేహం రాకమానదు. ఫోన్ అరేనాప్రకారం, ఒక శామ్ సంగ్ గెలాక్సీ, ఐఫోన్ వారి యజమానులను బుల్లెట్ల నుంచి కాపాడాయి.(చదవండి: ఇక తగ్గేదె లే అంటున్న టాటా మోటార్స్!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top