breaking news
Moto G5
-
బుల్లెట్ నుంచి మనిషి ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌ఫోన్
ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్ అంటే చాలా మంది వీడియోలు చూడటం కోసం, గేమింగ్ ఆడటం కోసం, ఫోటోలు తీయడం కోసం పనికొస్తుందని అనుకుంటారు. కానీ, మనం ఇప్పుడు చెప్పుకొనే స్మార్ట్‌ఫోన్ మాత్రం ఏకంగా మనిషి ప్రాణాలే కాపాడింది. మోటరోలాకు చెందిన ఐదేళ్ల పాత మోటో జీ5 స్మార్ట్‌ఫోన్ ఒక మనిషి ప్రాణం కాపాడింది. వేగంగా వస్తున్న బుల్లెట్‌ను అడ్డుకుని బుల్లెట్ ప్రూఫ్ లా పనిచేసింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ మొబైల్ కేసు మీద ది ఇన్ క్రెడిబుల్ హల్క్ డిజైన్ ఉంది. మార్వెల్ హీరో హల్క్, మోటో జీ5 కలిసి ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన గత వారం బ్రెజిల్లో దొంగతనం జరిగే సమయంలో జరిగింది. ఆ సమయంలో అక్కడున్న వ్యక్తిపై దుండగుడు బుల్లెట్ ఫైర్ చేశారు. అది నేరుగా మోటో జీ5 స్మార్ట్‌ఫోన్‌కు తగిలి దిశ మార్చుకొని నడుము భాగంలోకి దూసుకెళ్లింది. అలా చిన్నపాటి గాయంతో బయటపడ్డ వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది. ఇది తప్ప బుల్లెట్ వల్ల మరే ఇతర గాయం లేదు. ఫోన్ యజమానికి చికిత్స చేసిన వైద్యుడు షేర్ చేసిన ఫోటో ప్రకారం మోటో జీ5 బుల్లెట్ నుంచి ప్రాణాలు కాపాడింది. బుల్లెట్ ఫోన్ స్క్రీన్ ను తాకడం మనం చూడవచ్చు. ఇప్పుడు అది పగిలిపోయింది. ఫోన్ వెనుక భాగంలో పెద్ద బొడిపే కూడా ఉంది. ఫోన్ లో హల్క్ కేసు కూడా కనిపిస్తుంది. గతంలో వచ్చిన మోటో జీ5 వంటి ఫోన్లు చాలా మందంగా ఉండేవి. కానీ, ఇప్పుడు వచ్చే ఫోన్లు స్లిమ్, సున్నితమైన డిజైన్ తో వస్తున్నాయి. ఇలాంటి ఘటనల నుంచి కాపాడతాయా అనే సందేహం రాకమానదు. ఫోన్ అరేనాప్రకారం, ఒక శామ్ సంగ్ గెలాక్సీ, ఐఫోన్ వారి యజమానులను బుల్లెట్ల నుంచి కాపాడాయి.(చదవండి: ఇక తగ్గేదె లే అంటున్న టాటా మోటార్స్!) -
మోటో కొత్త ఫోన్లు లీక్.. ఫీచర్లివేనట!
లెనోవో మిడ్ రేంజ్లో తీసుకొస్తున్న మోటో జీ5, జీ5 ప్లస్ స్మార్ట్ఫోన్లు లాంచింగ్‌కు ముందే లీకైపోయాయి. ఫిబ్రవరి 26న బార్సిలోనాలో జరుగబోయే ఎండబ్ల్యూసీ 2017 ఈవెంట్లో వీటిని కంపెనీ అధికారికంగా లాంచ్ చేసేందుకు రంగం చేసుకుంది. కానీ అధికారికంగా లాంచింగ్‌కు ముందే వీటిని స్పానిస్ ఆన్ లైన్ రిటైలర్ తన సైట్ లో లిస్టుచేసేసింది. స్పెషిఫికేషన్స్, ఫీచర్లు, ఇతర వివరాలన్నింటిన్నీ ఈ రిటైలర్ లిస్టు చేసింది. మోటో జీ5, జీ5 ప్లస్ డిజైన్... మార్కెట్లోకి ఇక ఎంట్రీ ఇవ్వబోతున్న మోటో జీ5, జీ5 ప్లస్‌లు స్పోర్ట్ మెటల్ బాడీస్‌తో రాబోతున్నాయట. సైడ్ ప్యానెల్స్ విషయంలో లెనోవో బ్రాండింగ్ లో ఈ ఫోన్ మన ముందుకు వస్తోందని తెలుస్తోంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫ్రంట్ ప్యానెల్ లో ఉండబోతుందట. ప్రైమరీ కెమెరా వెనుకవైపు సర్క్యూలర్ డిజైన్ లో ఉంటుంది. మోటో ''ఎం'' లోగో కూడా వెనుకవైపే ఉంది. మోటో జీ5 స్పెషిఫికేషన్స్... 5 అంగుళాల ఫుడ్-హెచ్డీ డిస్ ప్లే, 32జీబీ బోర్డు స్టోరేజ్, 13 ఎంపీ రియర్ కెమెరా, 1.4గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 430 ఎస్ఓసీ, 2800 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్టీఈ సపోర్టును కలిగి ఉంటుంది. మోటో జీ5 ప్లస్ స్పెషిఫికేషన్స్... 5.2 అంగుళాల ఫుల్-హెచ్డీ డిస్ ప్లే, 64జీబీ స్టోరేజ్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12 ఎంపీ కెమెరా విత్ డ్యూయల్ ఆటోఫోకస్ ఫీచర్, 2 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ఎస్ఓసీ, 4జీ ఎల్టీఈ, 155 గ్రాముల బరువు ఇవీ మోటో జీ5 ప్లస్ ప్రత్యేకతలు. రెండు ఫోన్లకు ఉండబోయే సిమిలర్ ఫీచర్స్.. ఫుల్-హెచ్డీ స్క్రీన్ రెజుల్యూషన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 కవర్ ఆండ్రాయిడ్ 7.0 నోగట్ 128జీబీ వరకు ఎక్స్ పాండబుల్ మెమరీ 2జీబీ ర్యామ్ 5ఎంపీ ఫ్రంట్ కెమెరా వాటర్ రిపేలెంట్ కోటింగ్