ప్రమాదం ఆ కుక్క జీవితాన్ని మార్చింది.. ఏకంగా మనిషిలా..

A Dog That Lost Its Leg In An  Accident Has Learned How To Walk Upright Like A Human - Sakshi

న్యూయార్క్‌: కొన్ని అనుకోని ప్రమాదాల్లో కాళ్లు, చేతులు లేదా ఏదైనా అవయవాన్ని కోల్పోయిన తర్వాత మళ్లీ మన జీవితాన్ని యథావిధిగా కొనసాగించడానికి చాలా కష్టపడతాం.  అంతేకాదు ఆ ప్రమాదం వల్ల మానసికంగా కుంగిపోయి.. దాన్నుంచి బయటపడటానికే చాలా సమయం పడుతుంది. అదీ కాక ఆ అవయవం లేదన్న సంగతినే మొదట జీర్ణించుకోలేం.

(చదవండి: అత్యంత ఎతైన భవనం పై ఇలా కనిపించడం మూడోసారి)

ఏదిఏమైన మన జీవితాన్ని అద్భుతంగా సాగించాలన్న సంకల్పంతో ఏ అవయవ లోపాన్ని అయినా అత్యంత సులభంగా అధిగమించగలమని నిరూపించినవాళ్లు  చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ ఒక కుక్క తనకు కాలు లేకపోయిన మానవుల మాదిరిగా నడవగలనంటూ నిరూపించచింది. ఈ అసాధారణ సంఘటన వివరాలు.. 

వివరాల్లోకెళ్లితే... అమెరికా కొలరాడోలోని ఔరేకి చెందిన కెంటీ పసెక్ అనే వ్యక్తి పెంపుడు కుక్క డెక్స్టర్  కారు ప్రమాదంలో ఒక కాలు పోగొట్టుకుంటుంది. ఈ క్రమంలో ఆ కుక్కకి ప్రమాదం జరిగిన సంవత్సరంలోనే  ఆ కాలు నిమిత్తం సుమారు ఐదు సర్జరీలు కూడా జరిగాయి. అంతేకాదు కాలు పోయిన తర్వాత కుక్క తన మూడు కాళ్లతో నడవడం ప్రారంభించింది.

అచ్చం మనిషిలాగే నడుస్తుంది. అయితే ఆ కుక్క యజమాని దీనికి సంబంధించిన వీడియోతోపాటు "కుక్క వాస్తవాన్ని అంగీకరిస్తూ జీవించడానికీ ప్రయతిస్తోంది" అనే  క్యాప్షన్‌ జోడించి మరీ ట్వీట్‌ చేశాడు. దీంతో నెట్టింట ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఈ మేరకు నెటిజన్లు డెక్స్టర్‌ని ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు.

(చదవండి: ఈ ఏనుగు కథే వేరు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top