కోవిడ్‌ దెబ్బకు కుదేలవుతున్న చైనా! చికిత్స అందిచేందుకు కూడా..

Covid Hit Hard In China Face Lack Of Medicine Doctors And Equipment - Sakshi

జీరో కోవిడ్‌ పాలసీని ఎత్తేశాక ఘోరంగా కేసులు పెరిగిపోవడంతో పాటు అదేరీతిలో ఘెరంగా మరణాలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనాలో పలు ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఒకపక్క వైద్యులు నిరంతరం సేవలు అందిచంలేకపోతుంటే, మరోవైపు ఔషధాల కొరతతో గందరగోళంగా ఉంది. ఇంకోవైపు రోగుల సంఖ్య నానాటికి పెరుగుతూ..ఆస్పత్రులన్ని కిక్కిరిసిపోతున్నాయి. ప్రతి క్లినిక్‌ రోగులతో నిండి పోయి..ఆఖరికి వైద్యం ఆరుబయటే అందిచాల్సినంత దారుణంగా ఉంది పరిస్థితి. ఈ క్రమంలో తూర్పు చైనాలో అత్యంత పేద ప్రావిన్సులలో ఒకటైన అన్‌హుయ్‌ పట్టణం కరోనాతో విలవిలలాడుతోంది.

గత కొద్ది నెలల నుంచి పెరుగుతున్న కేసుల కారణంగా అధిక సంఖ్యలో వృద్ధులు ఆస్పత్రుల పాలయ్యారు. దీనికి తీడు ఔషధాల కొరతతోపాటు, కరోనాను నిర్థారించే కిట్‌లు సైతం వేగంగా అయిపోయాయి. అందువల్ల అక్కడ ప్రస్తుతం కరోనా టెస్ట్‌లు నిర్వహించలేని స్థితిలో ఉన్నారు అధికారులు. దీంతో అక్కడ ఎంతమందికి కరోనా పాజిటివ్‌ అన్నది కూడా తెలియనంత ఘోరంగా ఉంది. ప్రభుత్వం లాక్‌డౌన్‌ చేసినప్పుడే పరిస్థితులు  బాగున్నాయని అక్కడి ప్రజలు చెబుతుండటం గమనార్హం. ఆ ప్రావిన్స్‌కి సమీపంలోని పట్టణంలో ఉన్న హెల్త్‌ సెంటర్‌ అధికారి మాట్లాడుతూ..మందుల కోరత ఘోరంగా ఉందని, అందువల్లే ప్రిస్క్రిప్షన్లను కూడా నిలిపేశామని చెప్పారు.

అలాగే ఆస్పత్రులన్ని రోగులతో నిండిపోవడంతో మెట్ల వద్ద, ఆస్పత్రి వెలుపల వైద్యం అందిచాల్సి వస్తుందని అన్నారు. పైగా వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉన్న వృద్ధులను నగరంలోని పెద్ద ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు తెలిపారు. దీంతో రోగులంతా నిరాశ నిస్ప్రుహలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదనగా చెప్పారు. అందువల్ల తాము వారిని ఉత్సాహపరిచేలా..."ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దు, బ్రతికేందుకు ప్రయత్నిద్దాం, మిమ్మల్ని మీరు రక్షించుకోండి" అనే నినాదంతో కూడిన ‍బ్యానర్‌ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇంతవరకు అక్కడి గ్రామాల్లో కరోనా బారిన పడిన వృద్ధులు అసులు కోలుకోలేదని, కనీవినీ ఎరుగని రీతిలో అధిక సంఖ్యలో వృద్ధులే చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఐతే చైనా ప్రభుత్వం కూడా కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య బహిర్గతం చేయకుండా గట్టి ఆదేశాలు జారీ చేసింది. అలాగే అక్కడ ఉన్నవారెవరూ కూడా అధికారికంగా ఈ విషయాలు వెల్లడించడం కూడా నిషిద్ధమే. దీంతో అక్కడి ప్రజలు వాటి గురించి చెప్పేందుకు నిరాకరిస్తున్నట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

(చదవండి: కరోనా పరీక్షలు.. దక్షిణ కొరియా, జపాన్‌పై చైనా ప్రతీకార చర్యలు..)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top