Who Is VTubers: In Corona Pandemic VTubers Have Found An Alternate Reality To Live In - Sakshi
Sakshi News home page

Who Is VTuber: వీట్యూబర్లు ఎవరో తెలుసా..వీళ్లు సృష్టిస్తున్న హంగామా ఏంటో విన్నారా

May 18 2022 7:50 AM | Updated on May 18 2022 8:40 AM

In Corona Pandemic VTubers Have Found An Alternate Reality To Live In - Sakshi

మీకు వ్లాగులు అంటే ఏమిటో తెలిసే ఉంటుంది.. యూట్యూబ్‌ కంటెంట్‌ క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్షర్ల గురించి కూడా వినే ఉంటారు. కానీ...వీట్యూబర్లు ఎవరో తెలుసా. దేశంలో వీళ్లు సృష్టిస్తున్న హంగామా ఏమిటో విన్నారా. వెరైటీ పేరుతో పిచ్చి ప్రాంకుల కంటే బోలెడంత ఉపయోగకరమైన ఈ కొత్త ట్రెండ్‌ ఏమిటో చూసేయండి మరి.

ఒక్క ముక్కలో చెప్పాలంటే వర్చువల్‌ యూట్యూబర్లే ఈ వీట్యూబర్లు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా కంటెంట్‌ కోసం విపరీతమైన కరువు ఏర్పడింది. ఏదైనా విషయాన్ని కొత్తగా ఎలా చెప్పాలన్న ప్రయత్నంలో ఈ వీట్యూబర్ల వ్యవహారం బాగా ప్రసిద్ధి చెందింది. వాస్తవానికి ప్రపంచంలో మొట్టమొదట వర్చువల్‌ యూట్యూబర్‌ పదాన్ని వాడింది 2016లోనే. జపాన్‌కు చెందిన ‘కైజునా ఏఐ’ మొదలు పెట్టిన ఈ ట్రెండ్‌ అక్కడ బాగా ప్రజాదరణ చూరగొంది. స్థానికంగా అనేక కంపెనీల మార్కెటింగ్‌ కూ ఈ వీట్యూబర్లు ఉపయోగపడుతున్నారు. లైవ్‌ రికార్డింగ్‌ విషయంలో జపాన్‌ వీట్యూబర్లు ఇప్పటికే ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టారు.

ఆరేళ్ల క్రితం జపాన్‌లో మొదలైన ఈ వీట్యూబర్ల వ్యవహారం గత రెండేళ్లలో మరింత జోరందుకుంది. భారత్‌లోనూ యాపిల్‌ మెమోజీ సాయంతో వర్చువల్‌ అవతార్‌లను సృష్టించుకొని వాటి సాయంతోనే రకరకాల అంశాలపై ఈ వీట్యూబర్లు వీడియోలు చేస్తున్నారు. యాపిల్‌ ఐఓఎస్‌ 12, ఆ తరువాత వచ్చిన యాపిల్‌ ఫోన్లు లేదా ఐప్యాడ్‌ ఓఎస్‌లతో ఈ మెమోజీలను సృష్టించడం చాలా సులువు. మన పర్సనాలిటీ, మూడ్‌లకు అనుగుణంగా వర్చువల్‌ అవతార్‌లను తయారు చేసుకొని ఫేస్‌టైమ్‌లో మెసేజ్‌లు పంపుకోవచ్చు. తగిన ఐఫోన్, ఐప్యాడ్‌లు ఉంటే మెమోజీల్లో యానిమేషన్‌ కూడా చేయవచ్చు.
చదవండి: బారాత్‌లో తప్పతాగి పెళ్లికొడుకు డ్యాన్సులు.. మరొకరిని పెళ్లాడిన వధువు 

ఫన్, ఫిల్మీమోజీల క్రేజ్‌...
భారత వీట్యూబర్లలో ప్రస్తుతం బాగా క్రేజ్‌ ఉన్న వీట్యూబ్‌ చానళ్లలో ఫన్‌మోజీ, ఫిల్మీ మోజీలు రెండు. చిర్రా కార్తీక్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ రెండు చానళ్లలో ఒకటి పేరులో ఉన్నట్లే సినిమాల గురించి మాట్లాడితే... రెండోది చాలా సరదా అంశాలపై వీడియోలు తయారు చేస్తుంది. యాపిల్‌ కంపెనీ అని మోజీ మెమోజీలను మార్కెట్‌లో విడుదల చేసినప్పుడు కార్తీక్‌రెడ్డి తన యానిమేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌లోని కొందరు విద్యార్థుల సాయంతో ఈ చానళ్లను మొదలుపెట్టారు. పోటుగాడు, ఈమోజీ మామ, ఫిల్మీ ఫన్‌ అనిమోజీ, సూపర్‌ మోజీ పేర్లతో మరికొందరు వీట్యూబర్లు తాజాగా రంగంలోకి దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement