Viral Video: అంతరిక్షంలో వరి మొక్కలను విజయవంతంగా పెంచిన చైనా

Chinese Astronauts Cultivated Rice Plants In Space Watch Video - Sakshi

Taikonauts conducting life science experiment in space: చైనా సొంతంగా అంతరిక్ష కేంద్రాన్నినిర్మించుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణ పనులు పూర్తి అవుతున్న తరుణంలోనే చైనా పలు సైన్స్‌ ప్రయోగాలు ప్రారంభించింది. అందులో భాగంగా జీరో గ్రావిటీ ల్యాబ్‌లో వరి మొక్కలను విజయవంతంగా పెంచేసింది కూడా. ఈ విషయాన్ని చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌(సీఏఎస్‌) తన లైప్‌ సైన్సు పరిశోధనల్లో వెల్లడించింది.

ఈ ఏడాది జులైలో ఈ ప్రయోగాన్నిప్రారంభించినట్లు పేర్కొంది. ఈ మేరకు తాము రెండు రకాలైన విత్తానాలు...థాలేక్రెస్‌ అనే క్యాబేజ్‌ జాతికి చెందిన విత్తనం తోపాటు వరికి సంబంధించిన విత్తనాలతో స్పేస్‌ స్టేషన్‌లోని వెంటియన్‌ ల్యాబ్‌లో ఈ ప్రయోగాలు చేసినట్లు పేర్కొంది. ఈ మేరకుక చైనా వ్యోమోగాములు అంతరిక్షంలోని కృత్రిమ వాతావరణంలో ఈ విత్తనాల నుంచి మొక్కలను విజయవంతగా పెంచింది.

ఐతే థాల్స్‌క్రేస్‌ నాలుగు ఆకులు ఉత్పత్తి చేయగా, పొడవాటి కాండంతో వరి  మొక్కలు సుమారు 30 సెం. మీటర్ల వరకు పెరిగాయి. రేడియోషన్‌ స్థాయిలు అధికంగా ఉండే అంతరిక్షంలో మొక్కలు ఏవిధంగా ఉంటాయి అనేది తెలుసుకునేందుకే చైనా టైకోనాట్స్‌(వ్యోమోగాములు) ఈ ప్రయోగాలు చేస్తున్నట్లు వివరించారు. ఈ మేరకు చైనీస్‌ సెన్స్‌ అకాడమీకి చెందిన పరిశోధకుడు జెంగ్‌ హుక్వింగ్‌ మాట్లాడుతూ..."ఈ రెండు ప్రయోగాలు అంతరిక్షంలోని ప్రతి మొక్క జీవిత కాలాన్ని అధ్యయనం చేసేందుకు ఉపకరిస్తుందన్నారు.

అలాగే మొక్కలను పెంచేందుకే కాకుండా మైక్రోగ్రావిటీలో మొక్కల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఎలా పెంచాలో పరిశోధనల్లో తెలుస్తుందని చెప్పారు. అంతేకాదు పంటలను భూమి లాంటి వాతావరణంలోనే కృత్రిమంగా పెంచగలమని అన్నారు. మొక్కలు పుష్పించడం జరిగితే అంతరిక్షంలో మరిన్ని పంటలను పండించేందుకు దోహదపడుతుందని జెంగ్‌ అన్నారు."

అయినా చైనా ఏమీ తొలిసారిగా అంతరిక్షంలో మొక్కలు పెంచలేదు. గతేడాది జూలైలో చాంగ్‌ 5 అనే మిషన్‌తో ఒక వ్యొమోగామి బృందం వరి మొక్కను పెంచింది. ఈ మేరకు చైనా అంతరిక్షంలో తాము మొక్కలను ఏవిధంగా పెంచామో వివరించేలా ఒక వీడియోని కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీక్షించండి.

(చదవండి: రష్యా సుమారు 50 వేల బలగాలతో సైనిక విన్యాసాలు... టెన్షన్‌లో యూఎస్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top