రష్యాను బహిష్కరించేంత సీన్‌ ఏ దేశానికి లేదు.. పుతిన్‌కు చైనా దన్ను! జీ20 కాస్త జీ19గా..?

China Backs Russia Amid USA Plans Expel Putin Country - Sakshi

యుద్ధ నేరాలకు పాల్పడుతోందన్న ఆరోపణలతో రష్యాను.. జీ-20 గ్రూపు నుంచి బహిష్కరించాలని అమెరికా గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఉక్రెయిన్‌ యుద్ధంతో ఆర్థిక ఆంక్షల ద్వారా ఇప్పటికే రష్యాను అంతర్జాతీయ సమాజం నుంచి వెలేసినంత పని చేశాయి అమెరికా దాని మిత్రపక్ష పాశ్చాత్య దేశాలు. ఈ తరుణంలో చైనా, తన మిత్ర పక్షం రష్యాకు అనుకూల గళం వినిపించింది. 

జీ 20 అనేది అందులో ఉన్న సభ్య దేశాలు అంతర్జాతీయ ఆర్థిక సహకారం అందించుకునే వేదిక. అదేం దేశాల మధ్య జరిగే వ్యాపారం కాదు. అందులో రష్యా కీలక సభ్యత్వం ఉన్న దేశం. అలాంటి దేశాన్ని బహిష్కరించే హక్కు ఏ ఒక్క దేశానికి ఉండదు అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.   

ఇదిలా ఉండగా.. వింటర్‌ ఒలింపిక్స్‌టైంలోనే రష్యా-చైనాలు తమ బంధం బలమైందని ప్రకటించుకున్నాయి. అప్పటి నుంచి ఉక్రెయిన్‌ పరిణామంలో అమెరికా హెచ్చరికలను సైతం పట్టించుకోకుండా చైనా రష్యాకు మద్ధతుగా నిలుస్తోంది.
 

మరోవైపు జీ20 కూటమి నుంచి రష్యాను బహిష్కరించే విషయమై మిత్రపక్షాలతో చర్చించనున్నట్లు వైట్‌హౌజ్‌ జాతీయ భదత్రా సలహాదారు జేక్‌ సల్లివాన్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జీ 20 దేశాల్లో మొత్తం 19 దేశాలు ఐదు గ్రూపులుగా విడిపోయి ఉన్నాయి(యూరోపియన్‌ యూనియన్‌ అదనం). భారత్‌, రష్యాతో పాటు గ్రూప్‌-2 లో ఉంది.  

జీ 20కి పుతిన్‌!
క్రిమియా ఆక్రమణ తర్వాత 2014లో జీ8 దేశాలు పుతిన్‌ను(రష్యా) బహిష్కరించాయి. దీంతో జీ8 కాస్త జీ7గా మారింది. ఈ తరుణంలో జీ20 నుంచి రష్యాకు అలాంటి అనుభవమే పునరావృతం అవుతుందా? అనే కోణంలో చర్చ నడుస్తోంది ఇప్పుడు. అయితే ఈ ఏడాది జీ20 సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని పుతిన్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అక్టోబర్‌ చివర్లో బాలి(ఇండోనేషియా)లో జరగబోయే జీ 20 సదస్సుకు పుతిన్‌ హాజరవుతారని ఇండోనేషియాలో రష్యా దౌత్యవేత్త ల్యుద్మిలా వోరోబియెవా ప్రకటించారు.
 

చదవండి: చైనాను ఇరుకున పెడుతున్న రష్యా! అమెరికాకు మరింత మంటపుట్టించేలా..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top