హెలికాప్టర్‌ క్రాష్‌.. చిలీ మాజీ అధ్యక్షుడి మృతి | Sakshi
Sakshi News home page

హెలికాప్టర్‌ క్రాష్‌.. చిలీ మాజీ అధ్యక్షుడి మృతి

Published Wed, Feb 7 2024 8:31 AM

Chile Former President Died In Helicopter Crash - Sakshi

సాంటియాగో: చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్‌ పినేరా (74) హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు. పినేరా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ దక్షిణ చిలీలోని ఓ సరస్సులో కూలిపోయింది.  ప్రమాదం జరిగినపుడు హెలికాప్టర్‌లో పినేరాతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.

ప్రమాదంలో పినేరా ఒక్కరే మృతిచెందగా మిగతావారు గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌ను పినేరానే స్వయంగా నడిపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని అధికారికంగా ధృవీకరించలేదు. పినేరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చిలీ ఆర్మీ ప్రకటించింది.

చిలీ కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన పినేరా తొలిసారి 2010 నుంచి 2014 వరకు, రెండోసారి 2018 నుంచి 2023 వరకు దేశాధ్యక్షుడిగా పదవిలో ఉన్నారు. బిలియనీర్‌ అయిన పినేరా చిలీలోని అత్యంత ధనికుల్లో ఒకరు. ఆయన మృతి పట్ల దక్షిణ అమెరికా దేశాధినేతలతో పాటు  పలువురు ఇతర దేశాల అధినేతలు సంతాపం వ్యక్తం చేశారు. 

ఇదీ.. చదవండి..పాక్‌ ఎన్నికల బరిలో ఆమె అంతంతే

Advertisement

తప్పక చదవండి

Advertisement