
లండన్: బ్రిటిష్ రాయల్ నేవీ తొలిసారిగా హిందూ గురువును నియమించింది. హిందూ ధర్మ సిద్ధాంతాల ద్వారా నావికా సిబ్బందికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం చేసేందుకు ఈ నియామకం చేపట్టారు. క్రైస్తవుడు కాని వ్యక్తిని ఈ విధంగా ఎంపిక చేసిన తొలి సందర్భం ఇది. బ్రిటిష్ రాయల్ నేవీలో నియమితులైన 148 మంది కొత్త అధికారులలో భాను అత్రి ఒకరు.
భాను అత్రి (39) భారత్‌లోని హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన యువకుడు. ప్రస్తుతం బ్రిటన్‌లోని ఎసెక్స్‌లో నివసిస్తున్నారు. లండన్‌లో ఒక ఆలయ నిర్వహణలో ఆయనకు దీర్ఘకాల అనుభవం ఉంది. భాను అత్రి తాజా నియామకం కోసం ఆరు వారాల అధికారిక శిక్షణ పొందారు. ఇందులో భాగంగా నాలుగు వారాల యుద్ధనౌక హెచ్‌ఎంఎస్ ఐరన్ డ్యూక్‌లో సముద్ర మనుగడ శిక్షణ, మూడు వారాలపాటు హిందూ గురువుగా శిక్షణ పొందారు తాను నౌకాదళంలో మొదటి హిందూ గురువుగా ఎంపిక కావడం కావడం ఆనందంగా ఉందని అత్రి అన్నారు.
सोलन ज़िला के गढ़खल निवासी भानु अत्री जी को ब्रिटेन की रॉयल नेवी में हिंदू चैप्लेन (पादरी) के रूप में चयनित होने पर हार्दिक बधाई एवं शुभकामनाएँ।
भानु अत्री जी पहले भारतीय हैं, जिन्हें ब्रिटेन की रॉयल नेवी में यह गौरवपूर्ण दायित्व मिला है। उनकी यह उपलब्धि हिमाचल के साथ-साथ पूरे… pic.twitter.com/cVRabMesBW— Sukhvinder Singh Sukhu (@SukhuSukhvinder) August 18, 2025
భాను అత్రిని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌వీందర్ సింగ్ సుఖు అభినందించారు. బ్రిటన్ రాయల్ నేవీలో హిందూ గురువుగా ఎంపికైనందుకు భాను అత్రికి సీఎం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భాను అత్రి హిమాచల్‌తో పాటు దేశం గర్వించే స్థాయికి ఎదిగారన్నారు. 1986 సెప్టెంబర్‌లో జన్మించిన భాను అత్రి.. నల్వాలోని సరస్వతి నికేతన్ సీనియర్ సెకండరీ స్కూల్ నుండి ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత, సోలన్‌లోని సంస్కృత కళాశాల నుండి శాస్త్రి విద్యను పూర్తి చేసి, ఢిల్లీలో జ్యోతిష్య పట్టా పొందారు. 2009లో లండన్ చేరుకున్న అత్రి అక్కడ ఆలయ పూజారిగా బాధ్యతలు చేపట్టారు. భాను అత్రి తండ్రి రామ్ గోపాల్ అత్రి రిటైర్డ్ ఉపాధ్యాయుడు. భాను అత్రి తల్లి లీనా అత్రి గృహిణి. భాను అత్రి తన భార్య, పిల్లలతో పాటు లండన్‌లో ఉంటున్నారు.