breaking news
Royal Navy
-
బ్రిటిష్ రాయల్ నేవీలో తొలి హిందూ గురువుగా భాను అత్రి
లండన్: బ్రిటిష్ రాయల్ నేవీ తొలిసారిగా హిందూ గురువును నియమించింది. హిందూ ధర్మ సిద్ధాంతాల ద్వారా నావికా సిబ్బందికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం చేసేందుకు ఈ నియామకం చేపట్టారు. క్రైస్తవుడు కాని వ్యక్తిని ఈ విధంగా ఎంపిక చేసిన తొలి సందర్భం ఇది. బ్రిటిష్ రాయల్ నేవీలో నియమితులైన 148 మంది కొత్త అధికారులలో భాను అత్రి ఒకరు.భాను అత్రి (39) భారత్‌లోని హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన యువకుడు. ప్రస్తుతం బ్రిటన్‌లోని ఎసెక్స్‌లో నివసిస్తున్నారు. లండన్‌లో ఒక ఆలయ నిర్వహణలో ఆయనకు దీర్ఘకాల అనుభవం ఉంది. భాను అత్రి తాజా నియామకం కోసం ఆరు వారాల అధికారిక శిక్షణ పొందారు. ఇందులో భాగంగా నాలుగు వారాల యుద్ధనౌక హెచ్ఎంఎస్ ఐరన్ డ్యూక్‌లో సముద్ర మనుగడ శిక్షణ, మూడు వారాలపాటు హిందూ గురువుగా శిక్షణ పొందారు తాను నౌకాదళంలో మొదటి హిందూ గురువుగా ఎంపిక కావడం కావడం ఆనందంగా ఉందని అత్రి అన్నారు. सोलन ज़िला के गढ़खल निवासी भानु अत्री जी को ब्रिटेन की रॉयल नेवी में हिंदू चैप्लेन (पादरी) के रूप में चयनित होने पर हार्दिक बधाई एवं शुभकामनाएँ।भानु अत्री जी पहले भारतीय हैं, जिन्हें ब्रिटेन की रॉयल नेवी में यह गौरवपूर्ण दायित्व मिला है। उनकी यह उपलब्धि हिमाचल के साथ-साथ पूरे… pic.twitter.com/cVRabMesBW— Sukhvinder Singh Sukhu (@SukhuSukhvinder) August 18, 2025భాను అత్రిని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు అభినందించారు. బ్రిటన్ రాయల్ నేవీలో హిందూ గురువుగా ఎంపికైనందుకు భాను అత్రికి సీఎం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భాను అత్రి హిమాచల్‌తో పాటు దేశం గర్వించే స్థాయికి ఎదిగారన్నారు. 1986 సెప్టెంబర్‌లో జన్మించిన భాను అత్రి.. నల్వాలోని సరస్వతి నికేతన్ సీనియర్ సెకండరీ స్కూల్ నుండి ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత, సోలన్‌లోని సంస్కృత కళాశాల నుండి శాస్త్రి విద్యను పూర్తి చేసి, ఢిల్లీలో జ్యోతిష్య పట్టా పొందారు. 2009లో లండన్ చేరుకున్న అత్రి అక్కడ ఆలయ పూజారిగా బాధ్యతలు చేపట్టారు. భాను అత్రి తండ్రి రామ్ గోపాల్ అత్రి రిటైర్డ్ ఉపాధ్యాయుడు. భాను అత్రి తల్లి లీనా అత్రి గృహిణి. భాను అత్రి తన భార్య, పిల్లలతో పాటు లండన్‌లో ఉంటున్నారు. -
రాయల్ నేవీ చీర!
‘రాయల్ నేవీ’ అనేది కొత్త డిజైన్‌తో వచ్చిన చీర కాదు. విషయం ఏమిటంటే... సాంస్కృతిక వైవిధ్యాన్ని విస్తృతపరచడానికి శ్రీకారం చుట్టింది యూకే రాయల్ నేవీ. ఇందులో భాగంగా ‘ఫార్మల్ డ్రెస్‌కోడ్’ను అప్డేట్ చేసింది. అధికారిక కార్యక్రమాలలో మహిళా ఆఫీసర్లు చీరలు, సల్వార్ కమీజ్, లెహంగాలాంటి కల్చరల్ డ్రెస్‌లను ధరించడానికి అనుమతిస్తున్నట్లు తొలిసారిగా బ్రిటిష్ నేవీ ప్రకటించింది. అయితే వీటిపై యూనిఫాం షర్ట్, బ్లాక్ బో ధరించాల్సి ఉంటుంది. బ్రిటిష్ పాకిస్థానీ నేవీ ఆఫీసర్ దుర్దాన అన్సారి ఫొటోను జత చేస్తూ రాయల్ నేవీ(ఆర్ఎన్) డైవర్సిటీ నెట్వర్క్ చైర్ పర్సన్ జాక్ కనాని లింక్డిన్లో కొత్త పాలసీ గురించి ప్రకటించారు. ఈ ఫొటోలో అన్సారి తెల్లని చీరలో మెస్ జాకెట్ ధరించి కనిపిస్తుంది. అయితే ‘ఫార్మల్ డ్రెస్‌కోడ్’లో మార్పు తేవడం కొందరు మాజీ బ్రిటిష్ అధికారులకు బొత్తిగా నచ్చలేదు. ‘సాంస్కృతిక గుర్తింపును యూనిఫామ్‌తో కలపడం సరికాదు’ అని విమర్శించారు. అయితే వారి విమర్శల సంగతి ఎలా ఉన్నా ఫార్మల్ డ్రెస్‌కోడ్ అప్డేట్పై ఎక్కువ మంది సానుకూలంగా, సంతోషంగా స్పందించారు.(చదవండి: వ్యాధిని వరంలా మార్చి..కుటుంబాన్ని పోషించింది..!) -
50వేల కోట్ల యుద్ధ నౌకలు పనిచేయవా?
రక్షణ శాఖ కొత్తగా నిర్మించిన రెండు యుద్ధ నౌకల సేవలను యూకే వినియోగించుకోలేకపోవచ్చా?. తాజాగా యూకే నేషనల్ ఆడిట్ లో వెల్లడైన లెక్కలు ఈ విషయాన్ని ధ్రవీకరిస్తున్నాయి. నౌకలకు విద్యుత్తు సరఫరా చేసే కేబుల్స్ కొనుగోలుకు రక్షణ శాఖ దగ్గర డబ్బు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ రెండు యుద్ధ నౌకల నిర్మాణానికి యూకే రక్షణ శాఖ ఇప్పటికే 50,504 కోట్లకు పైచిలుకు ఖర్చు చేసింది. యూకే మిలటరీ బేస్ ల ఖర్చును పర్యవేక్షించిన నేషనల్ ఆడిట్ ఆఫీసు కొత్త యుద్ధ నౌకలు విద్యుత్తు సరఫరా కొరతతో నిలిచిపోతాయని తీవ్రంగా స్పందించింది. ఇప్పటికే రక్షణ శాఖ వద్ద తీవ్రంగా నిధుల కొరత ఏర్పడినట్లు చెప్పింది. వచ్చే 30 ఏళ్లలో అవసరమయ్యే 8.5 బిలియన్ల పౌండ్లను రక్షణ శాఖ ఖర్చు చేయలేదని తేల్చిచెప్పింది. దీనిపై స్పందించిన రాయల్ నేవీ పవర్ కేబుల్స్ ను అవసరమైన చోట అమర్చుతామని పేర్కొంది. 2017 ప్రారంభంలో అందుబాటులోకి వచ్చే హెచ్ఎమ్ఎస్ క్వీన్ ఎలిజిబెత్ యుద్ధ నౌక కోసం పోర్ట్స్ మౌత్ నావల్ బేస్ ను కూడా సిద్ధం చేస్తామని రాయల్ నేవీ ప్రతినిథి ఒకరు తెలిపారు. -
చితక్కొట్టుకున్న ఆటగాళ్లు
రగ్బీ మ్యాచ్‌లో బాల్ కోసం కొట్టుకోవడం గురించి విన్నాం కానీ, ఏకంగా గ్రౌండ్‌లోనే ఆటగాళ్లు ఒకరిని ఒకరు చితకొట్టుకున్నారు. ఈ సంఘటన ఫ్రాన్స్‌లోని టోలాన్లో బుధవారం రాత్రి రగ్బీ మ్యాచ్ జరుగుతుండగా చోటు చేసుకుంది. బాబ్‌కాక్ ఇంటర్నేషనల్ ట్రోపీలో భాగంగా బ్రిటీష్ రాయల్ నేవీ, ఫ్రాన్స్ మెరైన్ నేవీ జట్ల మధ్య బుధవారం రాత్రి మ్యాచ్ జరిగింది. మ్యాచ్ జరుగుతుండగానే గ్రే కలర్ డ్రెస్సుల్లో రాయల్ నేవీ ఆటగాళ్లు, బ్లూ కలర్ డ్రెస్‌లో ఫ్రెంచ్ ఆటగాళ్లు ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. రెఫరీ ఎంత ప్రయత్నించినా సయోద్యకుదరకపోవడంతో ఇరు జట్ల ఆటగాళ్లు తన్నుకున్నారు. -
‘విరాట్’కు విశ్రాంతి
ఐఎఫ్ఆర్ అనంతరం నిష్ర్కమించనున్న ఐఎన్ఎస్ విరాట్ అత్యధిక కాలం సేవలందించిన విమాన వాహక నౌకగా ప్రపంచ రికార్డు సాక్షి, విశాఖపట్నం: ఐఎన్ఎస్ విరాట్.. భారత నావికాదళానికి చెందిన విమాన వాహక యుద్ధనౌక.. అటు బ్రిటిష్, ఇటు భారత నావికాదళాలకు 57 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలందించి ప్రపంచంలోనే అత్యధిక కాలం పనిచేసిన యుద్ధనౌకగా గుర్తింపు పొందింది. ఏడేళ్ల క్రితమే భారత నావికాదళ సేవల నుంచి తప్పుకోవలసి ఉన్నా వీలుకాక ఇంకా సేవలందిస్తోంది. ఫిబ్రవరి 4 నుంచి విశాఖలో జరిగే అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్)లో ఆఖరి అంకాన్ని ప్రదర్శించి ఘనంగా వీడ్కోలు తీసుకోనుంది. అనంతరం షిప్ మ్యూజియంగా రూపాంతరం చెంది కాకినాడ తీరంలో కొలువుదీరనుంది. ఏకైక విమానవాహక యుద్ధనౌక బ్రిటిష్ రాయల్ నేవీలోకి హెచ్ఎంఎస్ హెర్మస్ పేరుతో ఈ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ (విమాన వాహక యుద్ధనౌక) 1959లో చేరింది. అర్జెంటీనాతో 1982లో జరిగిన (ఫాక్‌ల్యాండ్) యుద్ధం లో పాల్గొంది. సుమారు 27 ఏళ్లు రాయల్ నేవీలో సేవలందించాక దాన్ని 1986 ఏప్రిల్‌లో ప్రభుత్వం కొనుగోలు చేసింది. అనంతరం అవసరమైన మరమ్మతులు, హంగులు సమకూర్చుకుని 1987 మే 12న ఈ నౌక ఐఎన్ఎస్ విరాట్ పేరుతో ఇండియన్ నేవీలో చేరింది. అప్పట్నుంచి మన నావికాదళంలో అతిపెద్ద, ఏకైక విమానవాహక యుద్ధనౌకగా భాసిల్లుతోంది. దీని నుంచి 16 సీ హారియర్, 4 వెస్ట్‌ల్యాండ్ సీ కింగ్‌లు, 4 హెచ్ఏఎల్ ధృవ్‌లు, 2 హెచ్ఏఎల్ చేతక్.. వెరసి 26 ఎయిర్‌క్రాఫ్ట్‌లు రాకపోకలు సాగించే వీలుంది. ఇందులో 1207 మంది నౌకా సిబ్బంది, ఎయిర్ క్రూ మరో 143 మంది విధులు నిర్వహిస్తున్నారు. 226.5 మీటర్ల పొడవు, 48.78 మీటర్ల వెడ ల్పు ఉన్న ఈ భారీ యుద్ధనౌక 23,900 టన్నుల బరువును తీసుకెళ్లగలదు. ఇది గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో పయనిస్తుంది. వయసు మీరడంతో 2009లోనే ఐఎన్ఎస్ విరాట్‌ను సేవల నుంచి తప్పించాలనుకున్నారు. కానీ దాని స్థానంలో రష్యా నుంచి కొనుగోలు చేసిన ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ రాక ఆలస్యం కావడంతో ఏటేటా రీఫిట్ పనులు చేస్తూ కొనసాగిస్తున్నారు. 1986, 1999, 2008, 2009, 2012, 2013ల్లో దీనికి మరమ్మతులు చేపట్టారు. నౌకాదళ పశ్చిమ కమాండ్ పరిధిలో ముంబై కేంద్రంగా విరాట్ సేవలందిస్తోంది. కాకినాడలో షిప్ మ్యూజియంగా.. నౌకాదళ సేవల నుంచి తప్పించిన తరువాత కూడా ఐఎన్ఎస్ విరాట్ తన ప్రత్యేకతను చాటుకోనుంది. ఈ యుద్ధనౌకను కాకినాడ పోర్టు వద్ద షిప్ మ్యూజియంగా రూపొందించనున్నారు. ఇందుకోసం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కూడా పొందింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) దీనికవసరమైన ఏర్పాట్లు చేయనుంది. ఈ షిప్ మ్యూజియానికి రూ.20 కోట్ల ఖర్చవుతుందని అంచనా. ఇప్పటికే విశాఖ సాగరతీరంలో కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం ఉంది. కాకినాడ తీరంలో ఏర్పాటయ్యే ఐఎన్ఎస్ విరాట్ షిప్ మ్యూజియం దేశంలోనే మొట్టమొదటిది అవుతుంది.