బ్రెజిల్‌ అధ్యక్షుడికి అస్వస్థత.. ఆపరేషన్‌ అవసరమన్న వైద్యులు

Brazil President Bolsonaro Hospitalized Possible Intestinal Blockage Surgery - Sakshi

సావో పాలో: బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో అస్వస్థతకు గురై సోమవారం ఆస్పత్రిలో చేరారు. కడుపులో పేగుకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చేరినట్లు ట్వీటర్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, పేగుకు శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్లు వెల్లడించారు. 66 ఏళ్ల జైర్ బోల్సోనారో 2018 అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో కత్తిపోటుకు గురైనప్పటి నుంచి పలుమార్లు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే కరోనా టైంలో బోల్సోనారో నిర్ణయాల వల్ల బ్రెజిల్‌ తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. మాస్క్‌ అక్కర్లేదంటూ, వ్యాక్సినేషన్‌ వద్దంటూ నిర్ణయాలు తీసుకుని విమర్శలపాలయ్యాడు.

చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే మొసళ్లలా మారిపోవచ్చు

తద్వారా బ్రెజిల్‌లో లక్షల్లో కరోనా మరణాలు సంభవించగా.. బోల్సోనారో తీరును వ్యతిరేకిస్తూ జనాలు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేయడం ప్రపంచం మొత్తం వీక్షించింది. ఈ తరుణంలో బోల్సోనారో కోలుకోవద్దంటూ పలువురు సోషల్‌ మీడియాలో కోరుకుంటుండడం గమనార్హం.

సంబంధిత వార్త: బోల్సోనారో ఓ ‘రక్తపిశాచి’ అంటూనే.. నిరసనకారుల ఘోర తప్పిదం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top