పెంగ్విన్‌ పక్షులకు పెను ముప్పు.. హెచ్చరిస్తున్న సైంటిస్టులు

Bird Flu Threat To Penguine Birds In Antarctic - Sakshi

బ్యూనస్‌ఎయిరిస్‌: అంటార్కిటికాలోని అందమైన పెంగ్విన్‌ పక్షులకు పెను ముప్పు​ పొంచి ఉంది. అంటార్కిటికాలోని అర్జెంటీనా బేస్‌ ప్రైమావెరా సమీపంలో ఇటీవల మృతిచెందిన స్కువా సముద్ర పక్షుల్లో బర్డ్‌ఫ్లూ వ్యాధికి కారణమయ్యే వైరస్‌ (ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా) హెచ్‌5ఎన్‌1 బయటపడినట్లు స్పెయిన్‌కు చెందిన హయ్యార్‌ కౌన్సిల్‌ ఫర్‌ సైంటిఫిక్‌ ఇన్వెస్టిగేషన్‌(సీఎస్‌ఐసీ) తాజాగా వెల్లడించింది.

ఈ విషయమై స్పెయిన్‌తో కలిసి అర్జెంటీనా సైంటిస్టులు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. దూరం, ప్రత్యేక వాతావరణ పరిస్థితులను అధిగమించి వైరస్‌ అంటార్కిటికా ఖండంలోని పక్షులకు కూడా సోకడంపై అర్జెంటీనా సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు.

అంటార్కిటికా మెయిన్‌ల్యాండ్‌కు బర్డ్‌ ఫ్లూ వైరస్‌ చేరుకోవడంతో ఇక్కడ పెద్ద సంఖ్యలో నివసిస్తున్న పెంగ్విన్‌ జాతి పక్షులకు తీవ్రమైన ముప్ప పొంచి ఉందని వారు హెచ్చరిస్తున్నారు. తక్కువ ప్రదేశంలో ఎక్కువ పెంగ్విన్‌ పక్షులు నివసించే కాలనీలు ఈ ప్రాంతంలో ఉన్నందున వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని చెబుతున్నారు. 

ఇదీ చదవండి.. ప్రపంచంలో అతి పొడవైన గాజు వంతెన 

whatsapp channel

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top