వైరల్‌: తేనెటీగలతో సాహసం.. 21 మిలియన్ల వ్యూస్‌!

Beekeeper Removes Bee Colony With Bare Hands - Sakshi

 ‘తేనేటీగలు’ లేకపోతే మనుషుల మనుగడ కష్టం. జీవ జాతుల్లో అంత్యంత ముఖ్యమైన విలువైన జీవి ఏదంటే.. ‘తేనెటీగ’ అని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. మనుషులకి రోగాలు వ్యాప్తి చేయని ఏకైక జీవి కూడా తేనెటీగనే.. వాటి తేనె తుట్టిలను కదిలిస్తే తప్పించి.. అవి సాధారణంగా మనుషులపై దాడి చేయవు. అయితే తాజాగా ఓ మహిళ ఒట్టి చేతులతో తేనెతుట్టిలను తొలగించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ప్రొఫెషనల్ బీకీపర్స్ ఎరికా థాంప్సన్ ఒట్టి చేతులతో ఓ అపార్టుమెంట్‌లో గుంపుగా ఉన్న తేనెటీగలను తొలగించింది. 

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో షేర్‌ చేయగా 21 మిలియన్‌ల మంది నెటిజన్లు వీక్షించారు. అంతేకాదండోయ్‌ 4 లక్షల మంది లైక్‌ కొట్టి.. కామెంట్‌ చేశారు. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ..‘‘మీరు గొప్ప పని చేశారు. చాలా ధన్యవాదాలు! ఇది చాలా ఉత్తేజకరమైనది.’’ అంటూ కామెంట్‌ చేశారు. ఇక మరో నెటిజన్‌ “నేను ఈ యువతి వీడియోను రెండోసారి చూస్తున్నాను. ఆమె నైపుణ్యాలను ఆరాధిస్తాను.’’ అంటూ రాసుకొచ్చారు. కాగా ఆమె సాహసానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

(చదవండి: వైరల్‌ వీడియో: ఈ సూపర్‌ హీరోకి నెటిజన్ల ఫిదా)

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top