106 ఏళ్ల క్రితం మంచులో మునిగిన నౌక కోసం అన్వేషణ

Archaeologists Are Planning An Expedition To Find Sir Ernest Shackletons Endurance - Sakshi

లండన్‌ : 106 ఏళ్ల క్రితం అంటార్కటిక్‌ మంచులో కూరుకుపోయిన భారీ నౌక ‘సర్‌ ఎర్నెస్ట్‌ శాక్‌లెటన్స్‌ ఎండూరన్స్‌’ను కనుక్కునేందుకు మెరైన్‌ పురావస్తు శాస్త్రవేత్తల బృందం సిద్ధమైంది. 1914-1917 మధ్య కాలంలో అంటార్కటిక్‌ అన్వేషణ కోసం ఉపయోగించిన రెండు నౌకల్లో ఎండూరన్స్‌ ఒకటి. ధ్రువ ప్రాంతంలోని నీళ్లలో అన్వేషణ సాగించటం కోసం ఈ నౌకను ప్రత్యేకంగా రూపొందించారు. 144 అడుగుల పొడవున్న ఈ నౌక 28 మంది పురుషులతో వాసెల్‌ బేకు బయలుదేరింది. అయితే గమ్యాన్ని చేరుకోకుండానే 1915 జనవరి 18న వెడ్డల్‌ సముద్రంలో కూరుకుపోయింది.

అక్టోబర్‌ నెలలో ఉష్ణోగ్రతలు మరింత దిగజారటంతో ఎండూరన్స్‌ ముక్కలు అవసాగింది. ఈ నేపథ్యంలో 1915 డిసెంబర్‌లో నౌక మొత్తంగా మునిగిపోయింది. ఫాక్‌లాండ్‌ మారిటైమ్‌ హెరిటేజ్‌ ట్రస్ట్‌ ప్రస్తుతం ఈ నౌకను కనుక్కునేందుకు ప్రయత్నిస్తోంది. అండర్‌ వాటర్‌ రోబోట్స్‌ ద్వారా నౌకను అన్వేషించనుంది. 2022 ఫిబ్రవరిలో కేప్‌టౌన్‌నుంచి ఈ అన్వేషణ ప్రారంభం అవుతుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top