Antarctica: అధిక ఉష్ణోగ్రత.. కారణమిదే!

In Antarctica Record Heat Of 18 Degrees Celsius UN Agency Confirmed - Sakshi

అధిక ఉష్ణోగ్రతలు.. అది కూడా మంచుమయమైన అంటార్కిటికాలో పెరుగుతుండడంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. విశేషం ఏంటంటే.. ఇప్పటిదాకా ఈ గడ్డపై అత్యధిక ఉష్ణోగ్రత ఈ ఏడాదిలోనే నమోదు అయ్యిందని జులై 1న ఒక ప్రకటన విడుదల చేసింది యూఎన్‌వో. 

న్యూయార్క్‌: ఈ ఏడాది ఫిబ్రవరి 6న అంటార్కిటికాలో రికార్డు స్థాయిలో 18.3 డిగ్రీల సెల్సియస్ (64.9 డిగ్రీల ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది. దీంతో ఇప్పుడు అంటార్కిటికా సైతం వేగంగా వేడెక్కుతున్న ప్రాంతాల్లో ఒకటిగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక అంటార్కిటికాలో గత 50 ఏళ్లలో దాదాపు మూడు డిగ్రీల సెల్సియస్ మేరకు సగటు ఉష్ణోగ్రత పెరిగినట్లు డబ్ల్యూఎంఓ సెక్రటరీ జనరల్ పెటేరి తాలాస్ చెప్పారు. దీనికి సంబంధించిన రిపోర్టును ఆయన గురువారం వెల్లడించారు.

వేడికి కారణం
మంచు కొండలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధిక పీడనం కారణంగా ఫోహెన్ ప్రభావం ఏర్పడుతుంది. అంటార్కిటికాలో ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమని UN డబ్ల్యూఎంవో(వరల్డ్‌ మెటియోరోలాజికల్‌ ఆర్గనైజేషన్‌) రిపోర్టు వెల్లడించింది. ఫోహెన్ ప్రభావం వల్ల.. మంచు కొండలకు ఒకవైపు నుంచి వీచే సాధారణ గాలులు.. కొండ అంచు నుంచి మరో వైపునకు వీచేటప్పుడు వేడెక్కుతాయి. ఈ ఫలితమే అత్యధిక వేడి, ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఈ రిపోర్టు పేర్కొంది. ఈ దిగువ గాలుల ఫలితంగా.. అంటార్కిటికాలోని ఎస్పెరంజా స్టేషన్, సేమౌర్ ద్వీపంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. గతంలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడినట్లు నివేదికలో పొందుపరిచారు.

ఇంతకు ముందు.. 
గతంలో 2015, మార్చి 24న అంటార్కిటికాలో అత్యధికంగా 17.5 డిగ్రీల సెల్సియస్ (63.5 డిగ్రీల ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడి ఎస్పెరంజా పరిశోధనా కేంద్రంలో ఈ ఉష్ణోగ్రత నమోదైనట్లు డబ్ల్యూఎమ్‌ఓ తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో రికార్డు స్థాయిలో నమోదైన 18.3 డిగ్రీల సెల్సియస్ కొత్త రికార్డు కూడా అర్జెంటీనాలోని అదే స్టేషన్‌లో నమోదైనట్లు ఏజెన్సీ తెలిపింది. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు అంటార్కిటిక్ ట్రీటీ సిస్టంతో కలిసి పనిచేస్తున్నట్లు ప్రొఫెసర్ తాలాస్ చెప్పారు.

చదవండి: తొలిసారి నీలి తిమింగలం పాట!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top