Amazon Shopping Website Down: Restored Services After Global Outage - Sakshi
Sakshi News home page

Amazon down: షాపింగ్‌, వెబ్‌, అలెక్సా అన్నీంట్లో సమస్యలే!

Published Mon, Jul 12 2021 11:49 AM

Amazon shopping websites were down for hours now restored - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ షాపింగ్‌ దిగ్గజం అమెజాన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం దాకా కొన్ని గంటల పాటు ఆన్‌లైన్ షాపింగ్‌లో అంతరాయం ఏర్పడింది. గ్లోబల్‌గా కస్టమర్‌లు షాపింగ్ చేసేటప్పుడు తాత్కాలికంగా సమస్యలను ఎదుర్కొన్నారు. లాగిన్‌, షాపింగ్‌ సమస్యలు, ప్రైమ్‌ వీడియో సేవలకు అంతరాయం లాంటి ఫిర్యాదులతో ట్విటర్‌ మారు మోగింది.

ఇండియాతో పాటు యుకె, కెనడా, ఫ్రాన్స్ , సింగపూర్‌లోని పలు కస్టమర్లు అమెజాన్‌ డౌన్‌ అంటూ గగ్గోలు పెట్టారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీనిపై వినియోగ దారుల ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అమెజాన్‌ స్పందించింది. ఇబ్బందులు తలెత్తినమాట నిజమేనని, ప్రస్తుతం ఆ సమస్యలను పరిష్కరించామని, ప్రస్తుతం అంతా సజావుగా నడుస్తోందని  అమెజాన్ ప్రతినిధి  వెల్లడించారు. అయితే,  సేవల అంతరాయానికి గల కారణాలను స్పష్టం చేయలేదు.

ఇంటర్నెట్‌లో అంతరాయాలను గుర్తించే వెబ్‌సైట్ డౌన్‌డెటెక్టర్.కామ్ ప్రకారం అమెజాన్‌లోని పలు రకాల సేవలు గంటల పాటు నిలిచిపోయాయి. 40 మందికి వేలకు పైగా వినియోగదారులు తమ అమెజాన్ ఖాతా స్పందించడం లేదని నివేదించారు. అమెజాన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌తో పాటు అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో కూడా సమస్య లొచ్చాయని ఆరోపించారు.  ఫలితంగా అమెజాన్ ప్రైమ్ వీడియో, అలెక్సా సేవలు కూడా నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు.

Advertisement
Advertisement