Footballer As Adult Star: Danny Mountain Earnings, Failure Story In Telugu - Sakshi
Sakshi News home page

మానని గాయం: సాకర్‌ దూరం, ఆపై అడల్ట్‌ సినిమాలతో ఎంత సంపాదించాడంటే..

Aug 8 2021 1:17 PM | Updated on Aug 8 2021 4:52 PM

Adult Star Danny Mountain Earnings And Football Failure Story - Sakshi

ఆ కుర్రాడి లక్క్ష్యం బలమైందే. ఆ ప్రయత్నంలోనూ అతను సిన్సియర్‌గా ఉన్నాడు. కానీ, అనుకోకుండా జరిగిన ఘటన అతని జీవితాన్ని తలకిందులు చేసింది. ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా దేశానికి ఆడాలనే కల చెల్లాచెదురు అయ్యింది. 600 అడల్ట్‌ సినిమాలు.. కోట్లలో సంపాదన, బ్రాండ్‌ అంబాసిడర్‌గా-సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా రాణింపుతో అదనపు ఆదాయం, సెలబ్రిటీలతో సాన్నిహిత్యం.. ఇదీ 37 ఏళ్ల  అడల్ట్‌ స్టార్‌ డేనియల్‌ రెగినాల్డ్‌ మౌంటేయిన్‌ సాధించిన ఘనత కానీ ఘనత...
 

డేనియల్‌ రెగినాల్డ్‌ మౌంటేయిన్‌.. ఇంగ్లండ్‌ బ్రాక్‌నెల్‌లో 1984 జులై 18న పుట్టాడు. స్కూల్‌ వయసులో తొమ్మిదేళ్ల వయసుకే సాకర్‌లో మంచి ప్లేయర్‌గా పేరు రావడంతో చెల్‌సీ, వెస్ట్‌ హామ్‌, స్పర్స్‌ లాంటి జట్లు అతని మీద నజర్‌ పెట్టాయి. పదిహేను పదహారేళ్లకే సౌత్‌ఆంప్టన్‌ కీ ప్లేయర్‌గా అతని పేరు మారుమోగిపోయింది. ఇక సాకర్‌ శకంలో అతని టైం మొదలైందనుకున్న టైంలో.. విధివశాత్తూ కాలికి గాయం అయ్యింది అతనికి. మోకాలి గాయం కొన్ని నెలలపాటు వేధించింది అతన్ని. దీంతో ఫుట్‌బాల్‌కు పనికిరాడనే ఉద్దేశంతో సౌత్‌ఆంప్టన్‌ అతన్ని ట్రీట్‌మెంట్‌కు అయ్యే డబ్బు అందించి.. టీం నుంచి ఉద్వాసన పలికింది. అలా పదహరేళ్ల వయసుకే ఫుట్‌బాల్‌ కావాలనే కల చెదిరిపోయింది. 

డేటింగ్‌ గర్ల్‌ సాయంతో.. 
ఫుట్‌బాల్‌ రేపిన గాయం నుంచి తేరుకున్నాక.. కార్పెంటర్‌గా ఆరేళ్లపాటు పని చేశాడతను. ఆ టైంలోనే.. ఓ డేటింగ్‌ సైట్‌ ద్వారా ఒక అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. అయితే అతన్ని పోర్న్‌ సినిమాల్లో ప్రయత్నించమని చెప్పిందా యువతి. సిగ్గు-భయంతోనే లండన్‌లో జరిగిన అడిషన్స్‌కు వెళ్లిన అతనికి.. అవకాశం దక్కింది. విషయం తెలిసి ఇంట్లోవాళ్లు బాధపడ్డారు. కొన్నిరోజులకు అలవాటు పడ్డారు. అడల్ట్‌ సినిమాల్లో అవకాశాలు పెరుగుతున్నా కొద్దీ.. ఆదాయం-క్రేజ్‌ పెరగడం మొదలైంది. దీంతో 24 ఏళ్లకు లాస్‌ ఏంజెల్స్‌కు మకాం మార్చాడు.
 

పోర్న్‌స్టార్లతో డేటింగ్‌.. పెళ్లి
లాస్‌ ఏంజెల్స్‌లో అడుగుపెట్టాక.. డానీ మౌంటెన్‌ పేరుతో అడల్ట్‌ పరిశ్రమలో సూపర్‌ స్టార్‌ అయ్యాడు డేనియల్‌ రెగినాల్డ్‌. ఆ స్టార్‌డమ్‌తో సెలబ్రిటీలు అతనితో డేటింగ్‌కు క్యూ కట్టారు. అడల్ట్‌ భామలు ఎవా ఎంజెలీనా-మియా మాల్కోవాలు అతని మాజీ భార్యలు కూడా. ఇక హాలీవుడ్‌ ప్రముఖులు జాసోన్‌ స్టాథమ్‌, విన్నీ జోన్స్‌లు డేనియల్‌కి జిగిరీ దోస్తులు.

హయ్యెస్ట్‌పెయిడ్‌
ప్రస్తుతం అడల్ట్‌ ఫిల్మ్‌  స్టార్లలో హయ్యెస్ట్‌ పెయిడ్‌ యాక్టర్‌ టాప్‌ టెన్‌ లిస్ట్‌లో డేనియల్‌ రెగినాల్డ్‌ ఒకడు. ఏటా 1 మిలియన్‌ పౌండ్లకు పైనే అడల్ట్‌ సినిమాలతో సంపాదిస్తున్నాడు. కిందటి ఏడాదిలో డేనియలే నెంబర్‌ వన్‌ కూడా(తాజా రిపోర్ట్‌ ప్రకారం). ఇక హోటల్స్‌ బిజినెస్‌తో, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా-ఫిట్‌నెస్‌ కోచ్‌గా సంపాదన అదనం. డేనియల్‌కు సిల్వీ, జాక్సన్‌ అనే ఇద్దరూ పిల్లలు. భవిష్యత్తులో వాళ్లను అడల్ట్‌ సినిమాల్లోకి రానిస్తారా? అంటే.. తెలివైన సమాధానం ఇస్తున్నాడు. ‘చిన్నప్పుడు దేశానికి ఆడాలని కలలు కన్నా. కానీ, కుదరలేదు. ఇవాళ డబ్బు, హోదా అన్నీ ఉన్నాయి. కానీ, గాయంతో ఆ లక్క్ష్యం అసంపూర్తిగా ముగిసింది. అందుకే నేను సాధించింది పెద్ద ఘనతేం కాదు. అఫ్‌కోర్స్‌..  నాలా చాలా మంది ఉండొచ్చేమో. అలాంటివాళ్లకు ప్రయత్నించకుండా ఆగిపోవద్దని మాత్రం సలహా ఇస్తా. నా ఫెయిల్యూర్‌ స్టోరీని స్ఫూర్తిగా తీసుకుని.. జీవితంలో గెలుపు బావుటా ఎగరేయమని చెప్తా. 

ఇక అనుకోని వృత్తిలోకి దిగినప్పటికీ.. అనుకున్న గుర్తింపు మాత్రం దక్కలేదని బాధ మాత్రం ఇప్పటికీ నన్ను వేధిస్తోంది. అలాగని నా పిల్లల భవిష్యత్తును శాసించడం.. నిర్ణయించడం నా చేతుల్లో లేదు. కానీ, ఒక తండ్రిగా నా కూతురికి వద్దనే చెప్తా. కొడుక్కి మాత్రం ‘ధైర్యం చేయమ’ని ప్రొత్సహిస్తా చెప్తున్నాడు 37 ఏళ్ల డేనియల్‌ రెగినాల్డ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement