విషాదం: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి | Sakshi
Sakshi News home page

విషాదం: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి

Published Tue, Dec 5 2023 10:54 AM

14 Killed 20 Hurt In Thailand As Bus Crashes Into Tree - Sakshi

బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రచువాప్ ఖిరీ ఖాన్ ప్రావిన్స్‌లో బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. సోమవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది.

ప్రమాదంలో చెట్టును ఢీకొట్టిన బస్సు రెండుగా విడిపోయింది. ఈ ఘటనలో బస్సు శిథిలాల్లో చిక్కుకుని ప్రయాణికులు మృతి చెందారు. శిథిలాల్లో చిక్కుకున్న భాధితులను బయటకు తీశారు. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రికి తరలించారు.      

ఇదీ చదవండి: రైలు టాయిలెట్‌లో ఐదు నెలల చిన్నారి.. తరువాత?

 
Advertisement
 
Advertisement