స్కూలుకు తుపాకీ తెచ్చిన బాలుడు | 11 Year Old Naples Student Brings Gun To School | Sakshi
Sakshi News home page

స్కూలుకు తుపాకీ తెచ్చి.. తోటి విద్యార్థులను బెదిరించిన బాలుడు

Mar 4 2021 2:05 AM | Updated on Mar 4 2021 3:05 AM

11 Year Old Naples Student Brings Gun To School - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

నాప్లెస్‌: ఫ్లోరిడాలోని నాప్లెస్‌లోఉన్న ఓసియోలా ఎలిమెంటరీ స్కూలుకు చెందిన 11 ఏళ్ల బాలుడు తన బ్యాగులో తుపాకీ పెట్టుకొని పాఠశాలకు రావడం కలకలం రేపింది. కౌంటీ షెరిఫ్‌ అందించిన వివరాల ప్రకారం.. 4వ గ్రేడ్‌ చదువుతున్న బాలుడు తనతో పాటు తుపాకీని స్కూలుకు తెచ్చుకున్నాడు. అయితే అందులో బుల్లెట్లు లేవు. ఆ తుపాకీని తోటి విద్యార్థులకు చూపించి బెదిరించినట్లు పాఠశాల అధికారులు గుర్తించారు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు బాలున్ని అదుపులోకి తీసుకున్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement