
టోక్యో: ఏదైనా సాధించాలని అనుకుంటే దానికి వయసు ఎంతమాత్రం అడ్డంకి కాదని ‘కోకిచి అకుజావా’ నిరూపించాడు. జపాన్‌కు చెందిన ఈ 102 రెండేళ్లు వృద్ధుడు హృద్రోగంతో బాధపడుతున్నాడు. అయినా దానిని లెక్కచేయకుండా అత్యంత ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించి, గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నాడు.
1923లో జన్మించిన కోకిచి అకుజావా, నెలల తరబడి శిక్షణ పొందిన తర్వాత ఈ నెల ప్రారంభంలో జపాన్‌లోని అత్యంత ఎత్తయి శిఖరాగ్రానికి చేరుకున్నాడు. అకుజువా మీడియాతో మాట్లాడుతూ.. తాను ఈ శిఖరాన్ని చివరిసారి అధిరోహించినప్పటి కన్నా ఇప్పుడు ఆరేళ్లు పెద్దవాడినని అన్నారు. నాడు 96 ఏళ్ల వయసులో 3,776 మీటర్ల (12,388-అడుగులు) శిఖరాన్ని అధిరోహించానన్నారు. పశువుల పెంపకందారుడు, అకుజావా స్వచ్ఛంద సేవకునిగా, పెయింటర్‌గా పేరొందారు. గత జనవరిలో తాను హైకింగ్ చేస్తున్నప్పుడు కాలుజారి పడ్డానని, హృద్రోగాన్ని ఎదుర్కొన్నానని అయినా పర్వాతారోహ శిక్షణకు వెనుకడుగు వేయలేదన్నారు.
తాను చాలా వేగంగా కోవడాన్ని వైద్యులు కూడా నమ్మలేకపోయారని అకుజావా తెలిపారు. కుటుంబంలోని వారు వద్దని చెప్పినప్పటికీ అకుజావా పర్వాతారోహణ ప్రయత్నాన్ని విరమించలేదు. ఎద్దయిన పర్వతం మౌంట్ ఫుజిని మూడు రోజులలో అధిరోహించాడు. రాత్రి వేళ విశ్రాంతి తీసుకుంటూ అధిరోహణ కొనసాగించాడు. ఈ ప్రయత్నంలో కొందరు సహచరులు అతనికి సాయం అందించారు.